ప్రతి రోజు అర్థరాత్రి వరకు పడుకోకుండా ఉండే వారు ఇదొకసారి చదవండి.. లైట్‌ తీసుకుంటే మీ కర్మ

మారుతున్న పరిస్థితులు, చేస్తున్న ఉద్యోగాల కారణంగా ప్రతి రోజు కూడా పడుకునేప్పటికి అర్థరాత్రి దాటి పోతుంది.అర్థరాత్రి సమయంలో తిని పడుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు.

 Sleepless Problem, Mobiles, Using Mobiles Before Bed, Heart Problems-TeluguStop.com

ముఖ్యంగా మెట్రో నగరాల్లో జీవించే వారు సగటున 11 గంటల 30 నిమిషాలకు పండుకుంటున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది.కొందరు ఒకటి రెండు అయినా పడుకోకుండానే ఉంటున్నారట.

తెల్లవారు జామున మూడు గంటలకు పండే వారు కూడా కొందరు ఉన్నారనే ఆశ్చర్యకర విషయాలను సదరు సర్వే వెళ్లడి చేసింది.

Telugu Heart Problems, Mobiles, Mobiles Bee Bed-Telugu Health
Telugu Heart Problems, Mobiles, Mobiles Bee Bed-Telugu Health

ఏదైనా జాబ్‌ లేదా మరేదైన పని వల్ల రాత్రి సమయంలో లేట్‌ గా పండుకుంటే అర్థం ఉంది.కాని లేట్‌గా పండుకునే వారిలో 65 శాతం మంది కూడా టీవీ చూస్తూ, మొబైల్‌ చూస్తూ, సోషల్‌ మీడియాలో విహరిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారట.కొందరు రాత్రి పది గంటలకు ఫ్రీ అయితే అప్పుడు ఫోన్‌ పట్టుకుని మూడు నాలుగు గంటల పాటు మొబైల్‌తోనే కాలక్షేపం చేస్తున్నారట.

రాత్రి 12 గంటల తర్వాత కూడా మొబైల్స్‌ పట్టుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చూసే వారు, బ్రౌజింగ్‌ చేసేవారు మెట్రోనగరాల్లో వేలల్లో ఉంటున్నట్లుగా టెలికాం ఆపరేటర్లు చెబుతున్నారు.ఒక్క రోజు రెండు రోజులు పర్వాలేదు కాని, రోజు కూడా అర్థరాత్రి దాటిన తర్వాత పడుకోవడం, తెల్లవారు జాము వరకు కూడా మేలుకువతో ఉండటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని వైధ్యులు హెచ్చరిస్తున్నారు.

Telugu Heart Problems, Mobiles, Mobiles Bee Bed-Telugu Health

అర్థరాత్రి దాటిన తర్వాత మెలుకువతో ఉండే వారికి కలిగే ఆరోగ్య సమస్యలు :

ఎక్కువ సమయం నిద్ర పోకుంటా ఉంటే ముఖ్యంగా గుండె సమస్యలు వస్తాయట.నిద్రించే సమయంలో గుండెకు కాస్త విశ్రాంతి దక్కుతుంది.అంటే గుండె కొట్టుకునే వేగం కాస్త తగ్గుతుంది.పడుకోకుండా ఉంటే ఎప్పుడు ఒకే స్థాయిలో గుండె కొట్టుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయని వైధ్యులు చెబుతున్నారు.

రాత్రి సమయంలో ఎక్కువగా మెలుకువతో ఉంటే టైప్‌ 2 మధుమేహం వస్తుందని వైధ్యులు అంటున్నారు.మధుమేహం వచ్చిన వారిని పరిశీలించినట్లయితే 24 శాతం మంది రాత్రి సమయంలో సరైన నిద్ర లేని వారే ఉన్నారట.

Telugu Heart Problems, Mobiles, Mobiles Bee Bed-Telugu Health

ఇక రాత్రి సమయంలో పడుకోకుండా మొబైల్స్‌ చూసే వారు కంటి సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది.రాత్రి లైట్‌ వెలుతురులో మొబైల్స్‌ చూసే సమయంలో పక్కన వెలుతురు కంటే మొబైల్‌ లైట్‌ ఎక్కువగా ఉంటుంది.అది కంటిపై ప్రభావం చూపుతుందని, కొన్ని రోజులకే కంట్లో నీళ్లు కారడం, కళ్ల మంటలు వంటివి తలెత్తుతాయట.

Telugu Heart Problems, Mobiles, Mobiles Bee Bed-Telugu Health

రాత్రి లేట్‌ గా పడుకుంటే జీర్ణ సమస్యలతో పాటు పలు ఆరోగ్య సమస్యలు మరియు మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయి.అందుకే రాత్రి కనీసం 11 గంట వరకు అయినా పడుకుని, కనీసం 7 గంటలు నిద్రిస్తే మంచిదని వైధ్యులు సూచిస్తున్నారు.

మరి ఇప్పటికైనా మీ పద్దతిని మార్చుకుంటారా లేదంటే పైన చెప్పిన ఏదో ఒక అనారోగ్య సమస్యను కొని తెచ్చుకుంటారా అనేది మీ ఇష్టం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube