పరేషాన్ అవుతున్న పాయల్

ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ తనదైన ముద్ర వేసుకుంది.

అందాల ఆరబోతతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీ ఒక్క సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

ఈ సినిమాతో అమ్మడికి ఊహించని విధంగా పేరు వచ్చింది.దీంతో ఆర్ఎక్స్100 బ్రాండ్ నుండి బయటపడేందుకు అమ్మడు ఇంకా ప్రయత్నిస్తుంది.

అయితే ఇప్పుడు ఇదే అమ్మడికి మైనస్ పాయింట్ అయ్యిందని చెప్పాలి.అమ్మడు అంతలా బోల్డ్ పాత్ర చేయడంతో తమ సినిమాకు మరీ అంత బోల్డ్ బ్యూటీ వద్దనుకుని చాలా మంది ఆమెకు ఆఫర్లు ఇవ్వలేకపోయారు.

ఇక ఈ బ్యూటీ కూడా వచ్చిన అరకొర అవకాశాలను సరిగా వినియోగించుకోలేకపోయింది.వెంకీ మామ, డిస్కో రాజా వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించినా అమ్మడికి లీడ్ హీరోయిన్ పాత్ర మాత్రం రాలేదు.

Advertisement

ఇక చిన్న హీరోల సినిమాల్లోనూ కేవలం ఎక్స్‌పోజింగ్‌కే ఆమెను రికమెండ్ చేశారు.ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో తొలుత పాయల్ పాపనే అనుకున్నారు.

కానీ ఇప్పుడు అది ఓ కొత్త బ్యూటీకి ఇచ్చినట్లు తెలుస్తోంది.తనకు అవకాశాలు ఎందుకు రావడం లేదో అనే విషయం కూడా తనకు తెలియదని అంటోంది ఈ బ్యూటీ.

Advertisement

తాజా వార్తలు