రోడ్డు ప్రమాదానికి గురైన హీరో అజిత్... ఆందోళనలో అభిమానులు.... 

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ అటు తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటున్నాడు.

అంతేగాక హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ తన పని తాను చేసుకుంటూ పోయె హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు.

అలాగే తెలుగులో మంచి మార్కెట్ ఉన్నటువంటి తమిళ హీరోల జాబితాలో అజిత్ పేరు ఉంటుంది.అయితే ప్రస్తుతం అజిత్ కుమార్ వాలిమై అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు  హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే తాజాగా ఈ చిత్రం షూటింగ్ లో ఓ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో అజిత్ కుమార్ గాయపడ్డాడు.దీంతో వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు చికిత్స నిమిత్తం దగ్గర ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.

Advertisement

అయితే చికిత్స అనంతరం వైద్యులు కొంతమేర విశ్రాంతి అవసరమని అజిత్ కి సూచించారు.దీంతో చిత్ర యూనిట్ సభ్యులు అజిత్ కోలుకునే వరకు కొంతకాలం పాటు చిత్ర షూటింగ్ ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇది ఇలా ఉండగా హీరో అజిత్ కుమార్ గతంలో నటించినటువంటి వేదాళం, వివేగం, విశ్వాసం చిత్రాలు తమిళ్ బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకున్నాయి.అయితే అజిత్ కూడా గత కొద్దికాలంగా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా నిర్విరామంగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు