రామ్ చరణ్ గొప్ప మనస్సు.. చనిపోయిన మెగా అభిమాని కుటుంబానికి భారీ ఆర్థిక సాయం!

సాధారణంగా టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా సందర్భాలలో తాము రీల్ హీరోలమే కాదని రియల్ హీరోలమని ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు.

తమ అభిమానులు, అభిమానుల కుటుంబాలు కష్టాల్లో ఉంటే తమ వంతు ఆర్థిక సహాయం అందజేస్తూ ఉంటారు.

తాజాగా రామ్ చరణ్ అభిమాని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి తన గొప్ప మనస్సును చాటుకున్నాడు.నెల రోజుల క్రితం హైదరాబాద్ సిటీ చిరంజీవి యువత అధ్యక్షులు నూర్ మహ్మద్ గుండెపోటుతో మృతి చెందారు.

నూర్ మహ్మద్ మృతి చెందటంతో మెగాస్టార్ చిరంజీవి, స్టైలిస్ స్టార్ నూర్ మహ్మద్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వచ్చారు.నూర్ మహ్మద్ చనిపోయిన సమయంలో రామ్ చరణ్ విదేశాల్లో షూటింగ్ లో ఉన్నారు.

ఆ సమయంలో రామ్ చరణ్ తప్పకుండా నూర్ మహ్మద్ కుటుంబాన్ని ఆదుకుంటానని హైదరాబాద్ వచ్చిన తరువాత నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులను కలుస్తానని హామీ ఇచ్చారు.చరణ్ గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఉదయం నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులకు కలిశాడు.10 లక్షల రూపాయల చెక్కును నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులకు రామ్ చరణ్ అందజేశాడు.ఎప్పటికీ తాను రుణపడి ఉంటామని రామ్ చరణ్ చేసిన సహాయం ఎప్పటికీ మరవలేమని నూర్ మహ్మద్ కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబం కొరకు నూర్ మహ్మద్ చేసిన సేవలు ఎనలేనివి అని అన్నారు.

మా పుట్టినరోజులకు, సినిమా ఫంక్షన్లకు నూర్ మహ్మద్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేశాడని ఏరోజూ చేసిన సేవా కార్యక్రమాలు మేము చూడాలని మాకు తెలియాలని నూర్ మహ్మద్ కోరుకోలేదని అన్నారు.నూర్ మహ్మద్ కుటుంబానికి తాను ఎల్లప్పుడూ పెద్ద కొడుకులా అండగా ఉంటానని అన్నారు.నూర్ మహ్మద్ అమ్మాయిల పెళ్లికి తాను స్వయంగా వస్తానని పెద్ద కొడుకులా వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.

Advertisement

తాజా వార్తలు