రివాల్వర్ తో టిక్ టాక్ వీడియో... పేలిన తూటా

ఈ మధ్యకాలంలో టిక్ టాక్ యాప్ ప్రభావం యువతరాన్ని విపరీతంగా ఊపేస్తుంది.

ఈ టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులారిటీ రావడంతో అందులో డిఫరెంట్ గా చేసి ఫేమస్ అవ్వాలని రకరకాల పిచ్చి పనులు చేస్తూ వస్తున్నారు.

అలా చేస్తున్న వీడియోలని లక్షల సంఖ్యలో జనం చూస్తూ ఫాలో అవడంతో డిఫరెంట్ వీడియోలు చేసేవారు సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారిపోయారు.ఇదిలా ఉంటే ఇందులో పాపులారిటీ కోసం కొంత మంది మరింత పిచ్చితనంగా ప్రవర్తిస్తున్నారు.కొంత మంది ప్రమాదకర సాహసాలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు.18 ఏళ్ల యువకుడు ఓ రివాల్వర్‌తో టిక్‌టాక్ వీడియో తీసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తూ అది పేలడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ ఈ సంఘటన జరిగింది.

మృతుడిని జిల్లాలోని నవాబ్‌‌గంజ్ గ్రామానికి చెందిన కేశవ్‌గా పోలీసులు గుర్తించారు.టిక్‌టాక్ వీడియో తీసుకునేందుకు రివాల్వర్ ఇవ్వాలంటూ అతడు తన తల్లిని బలవంతపెట్టినట్టు ఆయన తెలిపారు.

ప్రమాద సమయంలో ఆ రివాల్వర్ లోడ్ అయి ఉన్న సంగతి కుటుంబ సభ్యులకు తెలియదని యోగేంద్ర పేర్కొన్నారు.మృతుడి తల్లి నిత్యావసర సరుకులు కొనేందుకు బయటికి వెళ్లగా ఆమెకు పెద్ద శబ్ధం వినిపించడంతో ఇంటికి పరుగెత్తుకొని వచ్చింది.

Advertisement

అప్పటికే తన కుమారుడు రక్తపుమడుగులో పడి చనిపోయి ఉన్నాడు.వెంటనే హాస్పిటల్ కి తరలించిన కూడా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారడంతో టిక్ టాక్ వీడియోలు చేసేవాళ్ళు ప్రమాదకర పనులకి దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు