కశ్మీర్‌ విషయంలో చైనా మద్దతు భారత్‌కేనా?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ రెండు రోజుల పాటు భారత్‌లో అదీ తమిళనాడులో పర్యటించిన విషయం తెల్సిందే.

రెండు రోజుల పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు జిన్‌పింగ్‌లు భేటీ జరిగాయి.

పలు విషయాల గురించి, దేశాల మద్య స్నేహం గురించి చర్చించారు.ఈ సందర్బంగా రెండు దేశాల మద్య ఉన్న పలు సమస్యలు మరియు వ్యాపార సంబంధిత విషయాల గురించి చర్చలు జరిగాయి.

కాని చాలా మంది అనుకున్నట్లుగా జిన్‌పింగ్‌ కశ్మీర్‌ విషయాన్ని చర్చల్లో లేవనెత్తలేదు.ఆ విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా వెళ్లడించారు.

కశ్మీర్‌ విషయం ఇండియా అంతర్ఘత విషయంగా చైనా భావించింది.అందుకే ఆ విషయం గురించి ప్రధాని మోడీ మరియు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మద్య చర్చకు రాలేదంటూ కేంద్ర వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

Advertisement

రెండు దేశాలకు సంబంధించిన విషయం కాదని అందుకే ఈ సందర్బంగా చర్చకు రాలేదని అంటున్నారు.కశ్మీర్‌ విషయంలో చైనా మద్దతు సంపూర్ణంగా ఇండియా ఉండటంతో పాకిస్తాన్‌ కడుపు మరింతగా మండే అవకాశాలు ఉన్నాయి.

మొత్తానికి జిన్‌పింగ్‌ ఇండియా పర్యటన ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.

Advertisement

తాజా వార్తలు