చిరు నిర్ణయాలకు తలొంచక తప్పట్లేదు?

స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం వస్తే ఏ దర్శకుడైన సరే ఎగిరి గంతేస్తాడు.

అయితే సినిమా చేయడానికి ఒప్పుకున్నాక కొన్ని విషయాల్లో పెద్ద హీరోల నిర్ణయాలకు దర్శకులు తలొంచక తప్పదు.

హీరోల సెంటిమెంట్లు కమిట్మేట్స్ కి అడ్జస్ట్ చేసుకోవాల్సిందే.వరుసగా నాలుగు బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న కొరటాల శివ కూడా మెగాస్టార్ చిరంజీవి నిర్ణయాలకు తలొంచక తప్పలేదు.

అసలు మ్యాటర్ లోకి వెళితే కొరటాల నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే.అయితే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎప్పటిలానే కొరటాల దేవి శ్రీ ప్రసాద్ ని ఫిక్స్ చేసుకోగా మెగాస్టార్ నిర్ణయంతో రాక్ స్టార్ ని పక్కనపెట్టేశారట.సైరాకి మ్యూజిక్ కి ఫిదా అయినా మెగాస్టార్ మరోసారి అమిత్ త్రివేదికి ఛాన్స్ ఇస్తున్నట్లు టాక్.

ఇక హీరోయిన్ విషయంలో ఒకరిద్దరిని సెలక్ట్ చేసుకున్న కొరటాల మెగాస్టార్ చిరంజీవి నిర్ణయానికి మళ్ళీ తన ఆలోచనను మార్చుకున్నాడట.సైరా సినిమాలో నటించిన నయనతారతో మెగాస్టార్ మరోసారి యాక్ట్ చేయాలనీ అనుకుంటున్నాడట.ఈ విధంగా దర్శకుడు కొరటాల మెగా ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తూనే తన నిర్ణయాల్ని చంపుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు