ఏపీలో మంత్రి పదవులు ! ఆ పీఠాధిపతికి పెరిగిన డిమాండ్

ఏపీలో కొలువు తీరుతున్న కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరెవరికి ఏ ప్రాధాన్యత ఆధారంగా దక్కబోతున్నాయి అనే లెక్కలు బయలుదేరాయి.

సోషల్ మీడియా లో అయితే ఎవరికి ఏ శాఖ కేటాయించబోతున్నారు అనే ఊహాగానంతో జగన్ క్యాబినెట్ లిస్ట్ ను తయారు చేసేసారు.

ఈ రోజు జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక చేయాల్సిందల్లా మంత్రిమండలి ఎంపికే.

ప్రస్తుతం మంత్రి పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది.అందుకే ఎవరికి వారు జగన్ దగ్గర మార్కులు కొట్టేసి ఆ తరువాత మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు.

ప్రస్తుతం జగన్ విశాఖపట్నంలోని శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ని ఎక్కువగా నమ్ముతున్నారు.ఆయన చెప్పిన విధంగానే చేస్తున్నారు.

Advertisement

దీనితో ఇప్పుడు మంత్రి పదవులు ఆశిస్తున్న వారంతా ఆయన మద్దతుతో మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు.అందుకే ఇప్పుడు స్వామి స్వరూనంద సరస్వతి ఆశీర్వాదం కోసం ఒక్కసారిగా నేతల ఆయన చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి రావడంతో విశాఖ శారదా పీఠం ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.ఎందుకంటే, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి , ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి, ముఖ్యమంత్రిగా ఇవాళ్ల మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం చేయడానికి.

ఇలా అన్ని ముహూర్తాలూ ఆయనే పెట్టారు.అంతేకాదు, ఆ మధ్య జగన్, విజయ సాయిరెడ్డిలతో సహా అనేక మంది వైసీపీ నాయకులతో ప్రత్యేక పూజలు కూడా ఆయనే చేయించారు.

ఆ పూజల ఫలితంగానే వైసీపీ అధికారంలోకి రావడానికి కారణం అయ్యింది అనేది వైసీపీ నాయకుల నమ్మకం.దీనికి తోడు జగన్ పూర్తిగా స్వామీజీని నమ్ముతుండడంతో ఆ స్వామి సిపార్సుతో మంత్రి పదవి దక్కించుకోవాలని నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు స్వరూపానందను తాజాగా కలిసిన వారిలో ఉండటం విశేషం.వీరంతా మంత్రి వర్గంలో స్థానం ఆశిస్తున్నవారే.విశాఖ జిల్లాకి చెందిన కొందరు వైసీపీ నాయకులు స్వామీజీని కలిసినప్పుడు.

Advertisement

మన జిల్లాకు ప్రాధాన్యత దక్కేలా మీరొక మాట జగన్ కి చెప్పిండి అంటూ ప్రాంతీయ అభిమానాన్ని తెరమీదకు తెస్తున్నారు.విషయంలో స్వామీజీ ముందు జాగ్రత్తతోనే వ్యవహరిస్తున్నారు.జగన్, కేసీఆర్ తన శిష్యులనీ, వారు ముఖ్యమంత్రులు కావాలని తన దగ్గరకి వచ్చారనీ, వాళ్లకి రాజయోగం ఉంది కాబట్టి యాగం చేశాను తప్ప తాను వారి వద్ద నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించలేదని, అందుకే వారికి ఎటువంటి సిపార్సులు చేసేందుకు తాను సిద్ధంగాలేనని స్వరూపానంద చెప్పేస్తున్నారట.

అయినా ఆశావాహులు వదలకుండా మమ్మల్ని గుర్తుంచుకోండి స్వామి అంటూ ప్రాధేయపడుతున్నారట.

తాజా వార్తలు