అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని చంపుతానని గతంలో బెదిరింపులకి పాల్పడిన వ్యక్తిని యూఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి కోర్టు ముందు హాజరు పరిచారు.అన్ని విచారణలు పూర్తి అయిన తరువాత ఆ వ్యక్తికి అమెరికా కోర్టు దాదాపు 140 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు అటార్నీ జాన్ దుర్హామ్.
గత ఏడాది సెప్టెంబర్ గ్యారీ గ్రావెల్ వ్యక్తి ట్రంప్ కి స్పాట్ పెట్టానని చంపడం ఖాయమని చెప్పిన విషయం విధితమే.
గ్యారీ గ్రావెల్ బయోటాక్సిన్ అనే పౌడర్‌ను ట్రంప్ ఇంటికి పంపాడు.
ట్రంప్ వ్యక్తిగత మెయిల్స్ కి వరుసగా బెదిరింపు మెయిల్స్ కూడా పంపాడు.అంతేకాదు వాషింగ్టన్ లో కొన్ని మసీదులలో బాంబులు అమర్చినట్టుగా బెదిరింపు కాల్స్ కూడా చేశాడు.
వాషింగ్టన్ నగరాల్లో ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో బాంబులు పెట్టినట్టు వైట్ హౌస్ కి లేఖ రాశాడు.దాంతో అప్పట్లో పోలీసులని పరుగులు పెట్టించాడు తీరా…
గ్రావెల్ చెప్పిన ఏ ప్రాంతంలో కూడా బాంబులు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు.2013 లోనూ గ్రావెల్ కొంతమంది వ్యక్తులని హతమార్చుతానని బెదిరింపులకి పాల్పడిన ఆరోపణలు ఉన్నాయి.అప్పట్లో జైలు శిక్ష అనుభవించి బయటకి వచ్చిన గ్రావెల్ మళ్ళీ ఇటువంటి దుశ్చర్యని ఏకంగా అధ్యక్షుడి పైనే ప్రయోగించడంతో ఈ సారి అమెరికా కోర్టు ఖటినమైన శిక్షని విధించింది
.