యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జిగా రూపాలి దేశాయ్‌.. నియామకానికి యూఎస్ సెనేట్ ఆమోదం

యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో తొమ్మిదో సర్క్యూట్‌కు సంబంధించి భారతీయ అమెరికన్ లిటిగేటర్ రూపాలి హెచ్ దేశాయ్‌ నియామకాన్ని అమెరికా సెనేట్ ధృవీకరించింది.తద్వారా ఈ శక్తివంతమైన కోర్టులో కీలక పదవిని అందుకున్న తొలి దక్షిణాసియా న్యాయమూర్తిగా ఆమె రికార్డుల్లోకెక్కారు.

 Us Senate Confirms Indian-american Roopali H Desai To A United States Court Of A-TeluguStop.com

దేశాయ్‌ నియామకాన్ని సెనేట్ 67- 29 ఓట్ల తేడాతో గురువారం ఆమోదించింది.కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రధాన కార్యాలయం వున్న తొమ్మిదో సర్క్యూట్‌.9 రాష్ట్రాలు, 2 ఫెడరల్ ఏరియాలు, 20 క్రియాశీల న్యాయస్థానాలతో కూడిన 13 కోర్ట్ ఆఫ్ అప్పీళ్లలో అతిపెద్దది.లిటిగేటర్‌గా 16 సంవత్సరాల అనుభవంతో.

తొమ్మిదో సర్క్యూట్‌కు దేశాయ్ అత్యుత్తమ ఎంపిక అని సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఛైర్ , సెనేట్ మెజారిటీ విప్ డిక్ డర్బిన్ అన్నారు.

సెనేట్‌లో ఓటింగ్‌కు ముందు.

సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమెర్ మాట్లాడుతూ.దేశాయ్ రెజ్యూమ్ ధృవీకరణకు అర్హత కలిగి వుందన్నారు.

ఆరిజోనా స్కూల్ ఆఫ్ లాలో గ్రాడ్యుయేట్, న్యాయమూర్తి మేరీ ష్రోడర్‌కు క్లర్క్, ఇప్పుడు తొమ్మిదో సర్క్యూట్ చీఫ్ జడ్జిగా పనిచేసిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారని షుమెర్ ప్రశంసించారు.ఆరిజోనా రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి ఎన్నికల న్యాయవాదులలో ఆమె ఒకరని.2020లో తన రాష్ట్ర ఎన్నికలను రక్షించడంలో దేశాయ్ కీలకపాత్ర పోషించారని ఆయన అన్నారు.కోవిడ్ మహమ్మారి సమయంలో పెంపుడు వ్యక్తుల సంరక్షణలో వున్న పిల్లల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల వరకు ఆమె పోరాడారని షుమెర్ కొనియాడారు.

Telugu Calinia, Chairsenate, Judgemary, San Francisco, Arizona, Senateconfirms-T

ఇకపోతే.కాపర్‌స్మిత్‌ బ్రోకెల్‌మాన్‌లో దేశాయ్ పార్ట్‌నర్ , అక్కడ ఆమె 2007 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు.2006 నుంచి 2007 వరకు లూయిస్ అండ్ రోకాలో సహచరురాలిగా వున్నారు.2005 నుంచి 2006 వరకు యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తొమ్మిదో సర్క్యూట్‌లో చీఫ్ జడ్జి మేరీ ష్రోడర్‌కు లా క్లర్క్‌గా దేశాయ్ పనిచేశారు.2005లో యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా నుంచి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని పొందారు.

రూపాలి నియామకాన్ని సెనేట్ ధృవీకరించడంపై ఆరిజోనా సీనియర్ సెనేటర్ కిర్‌స్టెన్ శైనిమా హర్షం వ్యక్తం చేశారు.

తొమ్మిదో సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు యూఎస్ న్యాయమూర్తిగా రూపాలి దేశాయ్ నియామకాన్ని ధృవీకరించినందుకు ఆరిజోనా గర్విస్తోందన్నారు.సమగ్రత, న్యాయబద్ధత, చట్టపరమైన పరిజ్ఞానానికి ఇది ఆమెకు దక్కిన గౌరవమన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube