ఒక చిన్న సెలూన్‌లో అమ్మాయిలతో షేవింగ్‌ చేయించుకున్న సచిన్‌.. ఎందుకో తెలిస్తే హ్యాట్సప్‌ చెప్తారు

ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ఎక్కడ అయితే ఉంటుందో, క్రికెట్‌ అభిమానులు ఎక్కడ అయితే ఉంటారో అక్కడ క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ గురించి తెలిసే ఉంటుంది.

క్రికెట్‌ అంటే సచిన్‌, సచిన్‌ అంటే క్రికెట్‌ అన్నట్లుగా పరిస్థితి మారింది.

అంతటి అద్బుతమైన ఆటతో తనకు తానుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న సచిన్‌ టెండూల్కర్‌ కొన్ని విషయాల్లో ఆకాశాన్ని మించిన ఔనత్యంను కనబర్చుతూ వస్తుంటాడు.అద్బుతమైన తన మంచి తనంతో మరింత అభిమానంను పొందుతున్నాడు.

సచిన్‌ను అభిమానిస్తారు అనడం కంటే ఆరాధిస్తారు అంటే కరెక్ట్‌ అవుతుంది.ఆటకు దూరం అయినా కూడా సచిన్‌ టెండూల్కర్‌ ఇంకా జనాల హృదయాల్లో ఉండటంకు ప్రధాన కారణం ఆయన మంచితనం.

తాజాగా ఆయన మరోసారి తన మంచి తనంను చాటుకున్నాడు.మంచి మనసున్న వ్యక్తిగా సచిన్‌ నిలిచాడు.

Advertisement

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన నేహా మరియు జ్యోతిలు కుటుంబ బాధ్యతను మోసేందుకు తమ తండ్రి చేసే వృత్తి అయిన బార్బర్‌ షాప్‌ను పెట్టారు.ఆడవారు ఎక్కువగా బ్యూటీ పార్లల్‌లు పెడతుంటారు.

అది కూడా ఆడవారికి మేకోవర్‌ చేయడానికి మాత్రమే.కాని యూపీకి చెందిన ఈ అమ్మాయిలు మాత్రం మగవారి కోసం బార్బర్‌ షాప్‌ను పెట్టి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మగవారే ఈ పని ఎందుకు చేయాలి, మేము చూడా ఈ పని చేయగలం అంటూ నేహా మరియు జ్యోతిలు నిరూపిస్తున్నారు.వీరిని ప్రోత్సహించడంతో పాటు అభినందించే ఉద్దేశ్యంతో జిల్లెట్‌ సంస్థ వీరి వద్దకు సచిన్‌ టెండూల్కర్‌ను తీసుకు వెళ్లడం జరిగింది.

ఆ అమ్మాయిల షాప్‌కు సచిన్‌ వెళ్లడంతో పాటు అక్కడ వారితో షేవింగ్‌ కూడా చేయించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.సచిన్‌ వెళ్లడంతో ఆ బార్బర్‌ షాప్‌కు యూపీలోనే కాదు దేశంలోనే పేరు వచ్చింది.సచిన్‌ చేయించుకున్న వద్ద తాము షేవింగ్‌ చేయించుకోవాలని, సచిన్‌ కూర్చున్న చోట తాము కూర్చోవాలని జనాలు ఆ బార్బర్‌ షాప్‌కు క్యూ కడుతున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అద్బుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో ఆ బార్బర్‌ సిస్టర్స్‌ చాలా సంతోషంగా ఉన్నారు.సచిన్‌ను ఇందుకే కదా దేవుడు అనేది అంటూ ఆయన అభిమానులు అంటున్నారు.అమ్మాయిలను ప్రోత్సహించేందుకు వారితో షేవింగ్‌ చేయించుకున్న సచిన్‌ టెండూల్కర్‌ను ఎంతగా పొగిడినా తక్కువే.

Advertisement

తాజా వార్తలు