విడ్డూరం : మోడీ తరపున ప్రచారం చేస్తుందని కుక్కను అరెస్ట్‌ చేసిన పోలీసులు, బెయిల్‌కు నిరాకరణ

దేశ వ్యాప్తంగా పార్లమెంటుకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే.ఎన్నికల సమయంలో అనేక చిత్ర విచిత్రాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.

ఎంతో మందిని పోలీసులు అనుమానంతో అరెస్ట్‌ చేయడంతో పాటు, వందల కోట్ల డబ్బును పోలీసులు పట్టుకున్నారు.ఇంకా కొన్ని ఏరియాల్లో వింత సంఘటనలు కూడా జరుగుతున్నాయి.

అత్యంత విచిత్రమైన సంఘటన ఈసారి మహారాష్ట్రలో జరిగింది.మహారాష్ట్ర పోలీసులు ఒక కుక్కను బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తుందనే ఉద్దేశ్యంతో అరెస్ట్‌ చేయడం జరిగింది.

ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ అయ్యింది.మహారాష్ట్రలో తాజాగా ఎన్నికలు జరిగాయి.

Advertisement

కొన్ని నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందు వరకు అన్ని కూడా బంద్‌ చేయాలి.

నాయకులు రోడ్డు మీద తిరగకూడదు.అసలు ఎన్నికల ప్రచారం చేయకూడదు.

పార్టీ గుర్తులు పట్టుకుని ఎవరికి చూపించకూడదు.అలా కనిపిస్తే వెంటనే పోలీసులు అరెస్ట్‌ చేస్తారు.

అయితే ఒక బీజేపీ మద్దతు దారుడు తన కుక్కకు బీజేపీ జెండా కట్టి రోడ్డు మీదకు వదిలాడు.కుక్క బీజేపీ జెండాతో మోడీకి ప్రచారం చేస్తుంది అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులు మీడియా ద్వారా ఈసీకి ఫిర్యాదు చేశాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఈ సందర్బంగా ఈసీ ఆ కుక్కను అదుపులోకి తీసుకున్నారు.దాంతో పాటు కుక్క యజమానిని కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

Advertisement

కుక్కను సంరక్షించడం తమ వల్ల కావడం లేదని పోలీసులు మున్సిపల్‌ వారికి అప్పగించారు.బెయిల్‌పై అతడు బయటకు వచ్చాడు.

కుక్కను మాత్రం పోలీసులు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు.కుక్కకు బెయిల్‌ కోసం అతడు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ విచిత్రమైన సంఘటన మన ఇండియన్‌ ప్రజాస్వామ్య వ్యవస్థను చెప్పకనే చెబుతుంది.

తాజా వార్తలు