భారతీయ విద్యార్ధినికి అమెరికా యూనివర్సిటీల...రెడ్ కార్పెట్..!!!

అమెరికాలో చదువుకోవాలంటే మామూలు విషయమా, అక్కడ వర్సిటీలు నిర్వహించే పరీక్షలలో పాస్ అవ్వాలి.లేకపోతే పెద్ద మొత్తంలో డొనేషన్స్ కట్టి చదువుకోవాలి.

అయినా సరే సీటు పక్కా వస్తుందనే నమ్మకం సూన్యం.కానీ భారతీయ విద్యార్ధినికి మాత్రం అమెరికాలోని 7 వర్సిటీలు మా దగ్గర చేరండి అంటూ లేఖలు పంపాయి.

ఇంతకీ ఆమె ఎవరు, ఎక్కడ ఉంటుంది, అనే వివరాలలోకి వెళ్తే.ఆమె పేరు సిమోనే నూరాలీ 17 ఏళ్ల ఈ యువతి చదువుల్లో చిన్నప్పటి నుంచీ రాణించేదట.

తమ తల్ల్లి తండ్రులు దుబాయ్ లో సెట్ అవడంతో వారితో పాటు దుబాయ్ లో ఉంటున్న ఆమె అమెరికాలో చదువుకోవడానికి అక్కడ ఎంట్రన్స్ టెస్ట్ లు రాసింది.అయితే ఆ ఏసీటీ పరీక్షలో 36కు 36 పాయింట్లు సాధించింది దాంతో అమెరికాలో ప్రఖ్యాత 7 యూనివర్సిటీలు ఆమెని తమ వర్సిటీలో చేర్చుకోవడానికి ఆమెకి సందేశం పంపాయి.

Advertisement

అవి యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, డార్ట్‌మౌత్‌ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం, జార్జ్‌టౌన్‌ వర్సిటీ, జార్జ్‌ వాషింగ్టన్‌ వర్సిటీ.అంతేకాదు భారత్ లో మహిళ అక్రమ రవాణాపై ఆమె రాసిన ది గర్ల్ ఇన్ ది పింక్ రూమ్ పుస్తకాన్ని పరిశోధన కోసం వాడుతున్నారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు