స్టార్‌ హీరోయిన్‌కు లవర్‌ బ్రేకప్‌ చెప్పాడు... కారణం అడిగితే సొల్లు చెబుతున్నాడు

కమల్‌ హాసన్‌ కూతురుగా పరిచయం అయినా కూడా నటిగా, సంగీత దర్శకురాలిగా, సింగర్‌గా పలు రంగాల్లో తనదైన సత్తా చాటి తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న శృతిహాసన్‌ గత మూడు సంవత్సరాలుగా లండన్‌కు చెందిన మైఖేల్‌ అనే డ్రామా ఆర్టిస్టుతో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే.

వీరిద్దరి మద్య వ్యవహారంకు కమల్‌ నుండి కూడా మద్దతు లభించింది.

వీరు పెళ్లి చేసుకుంటానేంటే వెంటనే పెళ్లి చేసేందుకు సిద్దం అంటూ ఆమద్య కమల్‌ ప్రకటించాడు.మొత్తానికి కమల్‌ హాసన్‌ నుండి కూడా పాజిటివ్‌ రియాక్షన్‌ను దక్కించుకున్న మైఖేల్‌ తాజాగా తాను ఈ ప్రేమకు గుడ్‌ బై చెబుతున్నట్లుగా ప్రకటించాడు.

శృతిహాసన్‌ మరియు నేను వేరు వేరు మార్గాల్లో నడవాల్సి ఉంది.ఇలాంటి మా ప్రయాణం వల్ల మేము విడిపోవాల్సి వస్తుంది.

మేమిద్దరం ప్రయాణించే మార్గాలు వేరుగా ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు దూరం అవుతున్నట్లుగా శృతిహాసన్‌ ప్రియుడు మైఖేల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.ఇతడి పోస్ట్‌తో ఇద్దరు విడిపోయినట్లుగా తేలిపోయింది.

Advertisement

గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.ఆవార్తలు నిజమే అని తేలిపోయింది.

శృతిహాసన్‌ మాత్రం ఈ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెళ్లడించలేదు.మైఖేల్‌ తాము విడిపోయి మంచి స్నేహితులుగా ఉండబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో శృతి హాసన్‌ రియాక్షన్‌ ఏమై ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

శృతి హాసన్‌ నుండి విడిపోవడంకు మైఖేల్‌ చెప్పిన కారణంగా సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.కారణం చెప్పమంటే మైఖేల్‌ సొల్లు కబుర్లు చెబుతున్నాడంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

దారులు వేరు అనే విషయం మొదట తెలియదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.మొత్తానికి శృతిహాసన్‌ లవ్‌ బ్రేకప్‌ అయినట్లే.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు