భారీ పారితోషకం ప్రకటించిన వైట్ హౌస్...ఎందుకంటే..?

అగ్రరాజ్యం అమెరికాకి తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు.

తమ అధునాతనమైన టెక్నాలజీ ద్వారా చురుకైన ఇంటిలిజెన్స్ ద్వారా ఎటువంటి విషయాన్ని అయినా సరే తెలుసుకోగల సత్తా అమెరికాకి ఉంది.

అయితే తాజాగా వైట్ హౌస్ ఇచ్చిన ప్రకటనతో ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు.లెబనాస్ లోని హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థకి ఎక్కడినుంచీ నిధులు అందుతున్నాయో తెలిపిన వారికి దాదాపు 10 మిలియన్‌ డాలర్ల అంటే సుమారు రూ.69 కోట్లు పారితోషికం గా ఇస్తామని ప్రకటించింది.ఈ మధ్య కాలంలో ప్రాశ్చస్చ్య దేశాలలో ఈ ఉగ్రవాద సంస్థ బాగా బలపడుతోంది.

ఈ సంస్థ సభ్యులు భారీ విధ్యంసాలకి పాల్పడుతున్నారు.వీరి వద్ద అదునాతమైన ఆయుధాలు, క్షిపణులు, రైప్ఫిల్స్ ఉన్నాయని అమెరికా నిఘావర్గాలు గుర్తించాయి.

కాగా ఈ సంస్థకి ఎక్కడి నుంచీ నిధులు వస్తున్నాయనే విషయాన్ని మాత్రం నిఘావర్గాలు చెప్పలేక పోతున్నాయి.దాంతో ఈ విషయాలని తెలుసుకునెందుకు అధికారులు తీవ్రగా శ్రమించాలని తాజాగా ట్రంప్ ఆదేశాలు జారీ చేయగా వైట్ హౌస్ ఈ భారీ పారితోషకం విషయాన్ని కూడా ప్రకటించింది.

Advertisement
బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?

తాజా వార్తలు