కేసీఆర్ సరికొత్త వ్యూహం.. సబితకు మంత్రి పదవి

ఎవరూ ఊహించని స్థాయిలో పొలిటికల్ గేమ్ మ్ ఆడడంలో లో టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మించిన వారు లేరు.

ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త వ్యూహాలకు తెరతీస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు.

ఆ విధంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చేలా సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్టు టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలోనూ మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో అనేక విమర్శలు చెలరేగాయి.

ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న సబితా ఇంద్రారెడ్డి తొలి శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ మీద విమర్శలు చేసింది.ఆ విమర్శలకు సమాధానంగా కేసీఆర్ క్యాబినెట్ లో మహిళలకు కు ఇవ్వాలని భావిస్తున్నాడు.

ఇటీవల టీఆర్ఎస్ లోకి సబితా ఇంద్రారెడ్డి చేరబోతున్నారని, ఆయన కుమారుడు కు ఎంపీ టికెట్, తనకు మంత్రి పదవి కావాలని ఆమె డిమాండ్ చేసినట్టు, దానికి కెసిఆర్ ఓకే చెప్పినట్టు వార్తలు వచ్చాయి.గతంలో తన మీద విమర్శలు చేసిన సబితకు ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా తన కేబినెట్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చామని అలాగే కాంగ్రెస్ ఘాటు విమర్శలకు ఇది ఘాటు రిప్లై లా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నాడు.

Advertisement

అంతే కాకుండా పార్టీలో సీనియర్ నాయకురాలిగా చెప్పుకుంటున్న మాజీ మంత్రి హరీష్ రావు వర్గమని అందరూ భావిస్తున్న ఓ మహిళా శాసనసభ్యురాలికి కూడా మంత్రి పదవి ఇవ్వకుండా ఈ విధంగా చెక్ పెట్టి హరీష్ హవా తగ్గించవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.ఇక హరీష్ వర్గానికి చెందిన ఆ శాసనసభ్యురాలు సబితా ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో ఈ విధంగా కూడా చెక్ పెట్టవచ్చని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు