ఆ కేసు కధ ఎంతవరకూ వచ్చింది..కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.

తెలంగాణలో తన గెలుపుతో మాంచి ఊపు మీద ఉన్న కేసీఆర్ , తనని ఓడించడానికి ఏపీ వదిలి మరీ తెలంగాణాకి వచ్చేసిన చంద్రబాబు పై నిప్పులు చేరుగుతున్నారు.

అంతేకాదు ప్రస్తుతం తన టార్గెట్ కేవలం తెలంగాణాని అభివృద్ధి పదంలో దూసుకుపోయేలా చేయడం మాత్రమే కాదు, చంద్రబాబు పై ఉన్న కేసు విషయాన్ని తెచేయడానికి సిద్దంగా ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అదేంటి మళ్ళీ ఓటుకు నోటు విషయం బయటకి వస్తోందా అనుకుంటున్నారా.బయటకి రావడం మాత్రమే కాదు నిన్నటి రోజున కేసీఆర్ అధికారులకి కీలక ఆదేశాలు జరీ చేశారట.

ఆ వివరాలలోకి వెళ్తే.

తెలంగాణ భవన్ టీ.ఆర్.ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగి , పార్టీ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నేతలు.ఈ సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు.

Advertisement

ఈ క్రమంలోనే ఓటుకు నోటుపై కూడా కేసీఆర్ రియాక్ట్ అయ్యారు.ఈ సారి ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, ఓటుకు నోటు ప్రాసెస్ లోనే ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇదిలాఉంటే కొంత కాలం క్రితం కేసీఆర్ ప్రగతి భవన్ లో పోలీసు ఉన్నత అధికారులతో సమావేశం అయ్యారు.ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ కూడా హాజరయ్యారు.

ఆ సమయంలోనే ఓటుకు నోటు డీల్ చేసిన ఏసీబీ మాజీ డీజీ ఏకే ఖాన్ కూడా హాజరావ్వటం జరిగింది.అయితే ఈ భేతీలోనే కేసీఆర్ ఓటుకు నోటు గురించి అడిగి తెలుసుకోవడంతో పాటు, ఫోరెన్సిక్ రిపోర్ట్ గురించి లోతుగా చర్చించినట్టుగా తెలుస్తోంది.అయితే

ఈ భేటీకంటే ముందుగానే కేసీఆర్ గవర్నర్ తో సుదీర్ఘ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది.చంద్రబాబుకి సంబంధించిన రికార్డ్ అయిన వాయిస్ పై ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏమని వచ్చింది.ఆ నివేదిక ఏమి చెబుతోంది అనే వివరాల గురించి చర్చలు జరుగుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

అంతేకాదు ఈ నివేదిక ఆధారంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయంపై కేసీఆర్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.మొత్తానికి ఏపీలో ఎన్నికలకంటే ముందుగానే ఈ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

Advertisement

తాజా వార్తలు