సైరాకు జక్కన్న మల్టీస్టారర్‌కు సంబంధం.. ఏంటో తెలిస్తే వావ్‌ అంటారు

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఉయ్యాలవాడగా చిరంజీవి కనిపించబోతున్నాడు.

బ్రిటీష్‌ వారితో ఉయ్యాల వాడ సాగించిన యుద్దంను ఈ చిత్రంలో ప్రముఖంగా చూపించబోతున్నారు.బ్రిటీష్‌ కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

బ్రిటీష్‌ నుండి నటీనటులను కూడా హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు.తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

ఇక అంతకు మించిన ఆసక్తితో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ కోసం కూడా ఎదురు చూస్తున్నారు.ఈ రెండు మూడు దశాబ్దాల్లో ఇంత భారీ మల్టీస్టారర్‌ చిత్రం వచ్చింది లేదు.

దాంతో సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరు మరియు తెలుగు సినిమా అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని చూడాలని ఆశపడుతున్నారు.ఇక ఈ రెండు చిత్రాలకు ఒక కామన్‌ పాయింట్‌ ఉంది.

అదే సినిమా నేపథ్యం.

సైరా మరియు జక్కన్న మల్టీస్టారర్‌ చిత్రాలు ఒకే తరహా కథా నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సైరా చిత్రం ఇప్పటికే స్వాతంత్య్రంకు పూర్వం కథతో తయారు అవుతుందని తేలిపోయింది.ఇక సైరా చిత్రం తరహాలోనే జక్కన్న మల్టీస్టారర్‌ చిత్రం కూడా స్వాతంత్య్రంకు పూర్తి నేపథ్యంలోనే తెరకెక్కుతుంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
షారుఖ్ కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన పవన్.. కారణాలివే!

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనబోతున్నట్లుగా కొందరు చెబుతున్నారు.స్వాతంత్య్ర ఉద్యమంతో సంబంధం లేకుండానే ఈ చిత్రాన్ని స్వాతంత్య్రంకు ముందు పరిస్థితుల నేపథ్యంలో జక్కన్న తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

మగధీర చిత్రంలో ఫ్ల్యాష్‌బ్యాక్‌ సీన్స్‌ తరహాలోనే ఈ చిత్రం కూడా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అయితే రాజులు, రాజ్యాలు లేకుండా బ్రిటీష్‌ కాలంలో ఒక ఊర్లో జరిగే పరిణామాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారు అంటూ కొందరు చెబుతున్నారు.

మొత్తానికి అయితే రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు మరోసారి ప్రేక్షకులను స్వాతంత్య్రంకు పూర్తి పరిస్థితుల్లోకి తీసుకు వెళ్లబోతున్నారు.సైరా చిత్రం 2019 సమ్మర్‌లో రాబోతుండగా, జక్కన్న మల్టీస్టారర్‌ మాత్రం 2020 సమ్మర్‌లో విడుదలకు సిద్దం కాబోతుంది.

ఈ రెండు చిత్రాలు కూడా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే విధంగా ఉంటాయని అంతా నమ్ముతున్నారు.

తాజా వార్తలు