పరీక్ష రాయాలంటే మెడలోని మంగళసూత్రం తీసేయమన్నారు..! ఇదెక్కడి వింత పరీక్ష?

భారత స్త్రీ అర్ధ రాత్రి ఒంటరిగా భయంలేకుండా రోడ్డు మీద తిరగలిగినప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని అన్నారు ఆ రోజుల్లో “గాంధీ” గారు.

కానీ మన సమాజంలో పగలు తిరగాలన్న స్త్రీలకూ రక్షణ లేకుండా పోయింది.

చివరికి పరీక్ష కేంద్రాల్లో కూడా సంరక్షణ లేకుండా పోయింది.పనికి రాణి నియమాలతో యువతులకు అవమానం జరిగింది.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

ఉత్తరప్రదేశ్ పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలకు భద్రత తనిఖీల పేరిట అధికారులు అవస్థలు పెట్టారు.పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థినుల చెవిపోగులు, మెడలో ఉన్న మంగళసూత్రాలను తొలగించారు.అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ రికార్డు చేయడంతోపాటు వారి ఫోటోలు స్క్రీనింగ్ చేసి పరీక్ష హాలులోకి అనుమతించారు.

Advertisement

హెయిర్ క్లిప్పులతోపాటు బూట్లు, స్లిప్పర్లు, బెల్టులు తీయించి బయటవేసిన తర్వాతే పరీక్షకు అనుమతించారు.కొంతమంది అభ్యర్థులు టీ షర్టులు సైతం విప్పించి తనిఖీలు చేశారు.పరీక్షల్లో తనిఖీల పేరిట అధికారులు తమను ఇబ్బందులు పెట్టారని అభ్యర్థులు ఆవేదనగా చెప్పారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు