హిందీ సినిమాల పరువు మళ్ళీ తీసిన బాహుబలి

బాహుబలి 2 సంచలనాలు ఇంకా ఆగట్లేదు.సినిమా విడుదలై, 1700 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించి ఆరు నెలలు అవుతున్నా, రికార్డులు ఇంకా బ్రేక్ అవుతూనే ఉన్నాయి.

 Baahubali 2 Creates All Time Record On Tv-TeluguStop.com

అదేదో, తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు ప్రేక్షకుల అండతో బ్రేక్ అయితే అది వేరే విషయం, కాని హిందీ ప్రేక్షకులు బాహుబలికి ఇంకా బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు.అక్టోబర్ 8న బాహుబలి 2 తొలిసారి టీవిలో టెలికాస్ట్ అయిన సంగతి తెలిసిందే.

హిందీ లో సోనీ మ్యాక్స్ ఈ చిత్రాన్ని ప్రసారం చేయగా, రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది.హిందీ టెలివిజన్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించిన సినిమా ప్రీమియర్ గా బాహుబలి రికార్డు సృష్టించింది.

సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ సినిమాలకు మళ్ళీ చుక్కలు చూపించింది

BARC విడుదల చేసిన ఫలితాల ప్రకారం, అత్యధికంగా వీక్షింపబడిన హిందీ సినిమా ప్రీమియర్స్ ఇవే :

TV impressions :

1) బాహుబలి 2 – 26054

2) ప్రేమ్ రతన్ ధన్ పాయో – 25119

3) బజరంగీ భాయిజాన్ – 23745

4) బాహుబలి – 20777

5) దంగల్ – 16264

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube