మూడు రోజుల్లో వందకోట్లు వసూలు చేసాడు

బాలీవుడ్ లో ఇప్పుడు అంతా 100 కోట్ల క్లబ్ లు నడుస్తున్నాయి.విడుదల అయిన ఏ సినిమా అయినా చాల తేలికగా 100 కోట్లు రాబడుతోంది.

సో ఈ లెక్కలో ఖాన్ త్రయం లో ముగ్గురు హీరోలు అయిన సల్మాన్ ఖాన్.షారూఖ్ ఖాన్ .ఆమిర్ ఖాన్ ల సినిమాలు అయితే ఇక చెప్పన్నక్కరలేదు.వీరి సినిమాలు 100 కోట్లు రావాడం సంగతి ఎప్పుడో రికార్డు గా పోయింది, అయితే ఎన్ని రోజుల్లో ఈ వసూలు జరుగుతుంది అనేదాని మీద పందేరం నడుస్తోంది.

మొన్న విడుదల అయిన సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా బుదవారం విడుదల అయినా కూడా దాదాపు 36 కోట్ల సొమ్ము వసూలు చేసింది .తరవాత రోజు రంజాన్ కావడం తో 37 కోట్లూ ఇవాల్టి వసూల్లూ కూడా కలుపుకుంటే మూడు రోజుల్లో 100 కోట్లు వచ్చేసాయి.తొలిరోజునే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడం.

పైగా సినిమాలో డల్ మూమెంట్స్ లేకుండా ఎక్కడ చూసినా కూడా ఎమోషనల్ గానో లేకపోతే యాక్షన్ ఎలిమెంట్స్ టైపులోనే డామినేషన్ ఉండటం.సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

Advertisement

సుల్తాన్ గా సల్మాన్ అదరగొడితే.అరాఫా పాత్రలో అనుష్క శర్మ ఉతికేసింది.

దానితో సినిమాకు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేకుండా పోయింది.

Advertisement

తాజా వార్తలు