దిల్ రాజు కి వ్యతిరేకంగా హీరో నిరాహార దీక్ష

ఆదిత్య ఓం .ఈ నటుడుని ఈపాటికి అందరూ మర్చిపోయి ఉంటారు కూడా.

 Fasting Programme Against To Dil Raju-TeluguStop.com

లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం లో హీరోగా చేసిన ఇతను తరవాత తరవాత కనుమరుగు అయిపోయాడు.ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచాడు మనోడు.

ప్రస్తుతం డైరెక్టర్ గా మారిన ఆదిత్య ” ఫ్రెండ్ రిక్వెస్ట్ ” అనే సినిమాలో నటించి దర్సకత్వం వహించాడు.

తను డైరెక్టర్ గా మారి తీసిన తొలి సినిమా విడుదల విషయం లో అడ్డంకులు వస్తున్నాయి అంటూ వీధికి ఎక్కాడు ఆదిత్య.

ఈ యన దర్శకత్వం వహించిన ‘ఫ్రెండ్ రిక్వస్ట్’ చిత్రం నిన్న థియేటర్ లలో విడుదలైంది.ఈ చిత్రం చాలా తక్కువ స్క్రీన్ లలో మాత్రమే విడుదలైంది.

దీనిపై ఫిల్మ్ ఛాంబర్ లో ఆదిత్య తన నిరసన వ్యక్తం చేశాడు.

ఈ సందర్భం గా ఆదిత్య మీడియా తో మాట్లాడుతూ.ఈ చిత్రం తన రెండున్నరేళ్ల కష్టమని, దీనికోసం దాదాపు రూ.4.5 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపాడు.ఈ చిత్రానికి హైదరాబాద్ లో కేవలం ఒక్క స్క్రీన్ మాత్రమే దక్కిందని అన్నాడు ఇదంతా దిల్ రాజు గారిని నమ్ముకోవడం వలన ఏర్పడిన పరిస్థితి అని ఆదిత్య అన్నాడు .

ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 150 థియేటర్ లలో విడుదల చేయాలని భావించినా.చివరికి కేవలం 30 థియేటర్ లు మాత్రమే దక్కాయని అన్నాడు.

ఇదే పరిస్థితి కొనసాగితే తన పెట్టుబడి ఎలా తిరిగి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు.తాను ఈ విషయం పై చివరి వరకు పోరాటం చేస్తానని అన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube