ఆట మొదలెట్టిన డొనాల్డ్ ట్రంప్ .. 7.25 లక్షల మంది భారతీయులు ఇంటికే?

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)బాధ్యతలు చేపట్టడంతో ఇమ్మిగ్రేషన్(Immigration) విధానంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడోనన్న ఆందోళన వలసదారులలో నెలకొంది.చట్టబద్ధంగా అమెరికాలో అడుగుపెట్టిన వారి కంటే అక్రమంగా అగ్రరాజ్యంలోకి వచ్చిన వారు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.

అనధికారిక లెక్కల ప్రకారం తాత్కాలిక వీసాలపై అమెరికాకు వచ్చిన వారు దాదాపు 1.40 కోట్ల మంది పైమాటేనని విశ్లేషకుల అంచనా.ఈ లిస్ట్‌లో భారతీయుల సంఖ్య దాదాపు 8 లక్షల మంది వరకు ఉంటుందని అంచనా.

మన తర్వాత మెక్సికో, సాల్వెడర్(Mexico, Salvador) జాతీయులు ఉన్నారు.

7.25 Lakh Illegal Indian Immigrants In Fear As Trump Makes Historic Order To End

అమెరికా భూభాగంపై విదేశీ దంపతులకు పుట్టినవారికి జన్మత: లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్(Trump) ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు.ఇది భారతీయులకు శరాఘాతం కానుంది.అగ్రరాజ్య జనాభాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులే.

అంతేకాదు.వీరిలో మూడో వంతు అమెరికా గడ్డపై పుట్టినవారే.

Advertisement
7.25 Lakh Illegal Indian Immigrants In Fear As Trump Makes Historic Order To End

తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి, గ్రీన్‌కార్డ్(Green Card) కోసం ఎదురుచూస్తున్న వారికి పుట్టిన పిల్లలకు ఇకపై అమెరికా పౌరసత్వం లభించదు.అమెరికా రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలోని 14వ సవరణ కింద ఆ దేశంలో పుట్టిన పిల్లలకు జన్మత: అమెరికా పౌరసత్వం లభిస్తుంది.దీనిపై ఎన్నికల ప్రచారంలోనే విమర్శలు చేసిన డొనాల్డ్ ట్రంప్.

చెప్పినట్లుగానే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే షాకిచ్చారు.

7.25 Lakh Illegal Indian Immigrants In Fear As Trump Makes Historic Order To End

జన్మత: సంక్రమించే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయడంపై డెమొక్రాట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించాయి.అధ్యక్షుడి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రాజ్యాంగ(Executive Order Constitutional) విరుద్ధమని.ఇవి అమల్లోకి రాకుండా చూడాలని కోరాయి.

కోర్టులు గనుక అధ్యక్షుడి ఆదేశంపై జోక్యం చేసుకోకుంటే 30 రోజుల్లోగా ఈ కార్యానిర్వాహక ఉత్తర్వు అమెరికాలో అమల్లోకి రానుంది.అదే జరిగితే దాదాపు 7.25 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుంది.దీంతో ఏం జరుగుతుందోనని వారంతా బిక్కుబిక్కుమంటున్నారు.

కన్నప్ప తరహాలో మరో గెస్ట్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్.. హీరో ఎవరంటే?
Advertisement

తాజా వార్తలు