6 అంతస్థుల బిల్డింగ్.. అతిథులు కేవలం పక్షులే!

ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి చాలా కష్టపడుతుంటారు.తమ స్తోమత కొద్దీ మట్టి ఇల్లు, చెక్క ఇల్లు, డాబాలు కట్టుకుంటుంటారు.

అయితే పూరిళ్లలో ఉంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియక, ఇంటిపై నుంచి వర్షం కారుతూ ఉంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు.అందుకే ప్రభుత్వం అందించే సాయంతో పక్కా ఇళ్లు నిర్మించుకుంటారు.

తమకు స్తోమత కొద్దీ చిన్న ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవిస్తుంటారు.అయితే పశుపక్ష్యాదులకు ఒక ఇల్లంటూ ఉండదు.

పక్షులు కట్టుకున్న గూళ్లు వర్షాలకు, గాలి వానలకు కూలిపోతుంటాయి.చెట్లపై పెట్టుకున్న గూళ్లు గాలికి ఎగిరిపోతాయి.

Advertisement

అయితే ఓ పక్షి ప్రేమికుడు వినూత్నవంగా ఆలోచించాడు.పక్షుల కోసం ఏకంగా ఓ ఇల్లు నిర్మించాడు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆరు అంతస్తుల భవనాన్ని పక్షుల కోసం ప్రత్యేకంగా నిర్మించారు.

రాజధాని నగరంలోని పింజర పోల్ గోశాల సభ్యులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ టవర్ ఒకేసారి దాదాపు 2,000 పక్షులకు వసతి కల్పిస్తుంది.

అందమైన బర్డ్‌హౌస్ చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.పక్షులు విశ్రాంతి తీసుకునే అనేక చిన్న గేట్ లాంటి ఓపెనింగ్‌లతో ఎత్తుగా ఉన్న నిర్మాణాన్ని రూపొందించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

పింజారా పోల్ గోశాల సభ్యుడు ఆర్ విజయవర్గియా మాట్లాడుతూ తాము నిర్మించిన ఈ భవనం ఒకేసారి 2 వేల పక్షులకు ఆశ్రయం ఇవ్వగలదని చెప్పారు.అలాంటి ఆలోచన ఎలా వచ్చిందని అడిగినప్పుడు, అతను ఇలా చెప్పాడు.

Advertisement

"ఈ రోజు, ప్రజలు భారీ భవనాలలో నివసిస్తున్నారు.కానీ వారు పక్షుల గురించి మరచిపోతున్నారు.

అందుకే మేము ఇలా భవనాన్ని నిర్మించాము" అని చెప్పారు.అతడిని గొప్ప ఆశయాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.

తాజా వార్తలు