మగువా నీకు వందనం.. అమెరికాలో ఐదుగురు భారత సంతతి మహిళలకు సత్కారం..!

ఆమె ఒక తల్లి, కూతురు, సోదరి, భార్య.వీటన్నింటికి మించి ఒక పోరాట యోధురాలు.

శక్తి యుక్తులు కలిగిన నారీమణి.అతని వెంట ఆమె కాదు.

అన్నింటా ఆమే.అదే ఇప్పుడు ఆమె లక్ష్యం.ఆవకాయ పెట్టడం నుంచి అంతరిక్షానికి చేరుకునే వరకు.

అగ్గి పెట్టెల తయారీ దగ్గర్నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు అన్నింటా ఆమె ఉనికి కనిపిస్తోంది.ఆమె ఆకాశంలో సగం కాదు.

Advertisement

ఇప్పుడు ఆమే ఆకాశం.పురుషాధిక్య సమాజంలో మగవాళ్లను తోసిరాజని మహిళలు (Women) దూసుకెళ్తున్నారు.

ఆ రంగం ఈ రంగం అని లేకుండా ఇప్పుడు అన్నింటా ఆమె తోడ్పాటు లేకుండా ఏ వ్యక్తి కానీ, ఏ వ్యవస్థ కానీ ఏం చేయలేరని ఎన్నో సార్లు రుజువైంది.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా (America)వెళ్లిన భారతీయుల్లో మహిళలు కూడా వున్నారు.

వీరు అక్కడ కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడిస్తున్నారు.ఇప్పుడు అమెరికాలో రెండో శక్తివంతమైన పదవిలో వున్నది ఓ మహిళ, అందులోనూ భారతీయురాలు కావడం మనందరికీ గర్వకారణం.

కాగా.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(International Womens Day) పురస్కరించుకుని అమెరికాలో ఐదుగురు భారత సంతతి మహిళలను ఘనంగా సత్కరించారు.

వీడియో: పాకిస్థాన్‌లో ప్రాంక్ చేసిన యువకులు.. లాస్ట్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్..?
వైరల్ వీడియో : కారుతో ఢీకొట్టి పరారైన బీజేపీ అధ్యక్షుడి కుమారుడు..

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్, న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో(Consulate General Of India) కలిసి మార్చి 8న ఐదవ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా రంగాల్లో కృషి చేసిన ఐదుగురు మహిళలను సత్కరించినట్లుగా ఫెడరేషన్ తెలిపింది.అవార్డ్ గ్రహీతలలో మీరా జోషి ( న్యూయార్క్ డిప్యూటీ మేయర్ ), రాధా సుబ్రహ్మణ్యం (సీబీఎస్ టీవీ నెట్ కార్ప్ ప్రెసిడెంట్, చీఫ్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ ఆఫీసర్ ),

Advertisement

హీనా పటేల్ (టెడ్ ఎక్ స్పీకర్, ఎగ్జిక్యూటివ్ లీడర్), పద్మినీ మూర్తి (అమెరికన్ మెడికల్ ఉమెన్స్ అసోసియేషన్స్ ఫిజిషియన్), ఫాలూ షా (గ్రామీ అవార్డ్ విజేత, సింగర్) వున్నారు.న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.అవార్డ్ గ్రహీతలను అభినందించారు.

తమ సేవలు, చర్యల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసే కార్యక్రమాలను కొనసాగించాలని జైస్వాల్ పిలుపునిచ్చారు.

తాజా వార్తలు