బావిలో ప‌డ్డ చిన్నారి కోసం వెళ్తే.. ఏకంగా 40మంది అదే బావిలో..!

చాలా విషయాల్లో కొంత మంది ప్రవర్తించే తీరు మరీ హాస్యాస్పదంగా ఉంటుంది.తెలిసి చేస్తరో.

తెలియకో అర్థం కాక తలల పట్టుకుంటుంటాం.ఇలాంటిదే ఓ ఘటన ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లోని విధిషా జిల్లాలో జరిగింది.

ఆడుకుంటూ ఉండగా.ప్రమాద వశాత్తు బావిలో పడిన చిన్నారిని కాపాడదామని వెళ్లిన మరో 40 మంది కూడా అదే బావిలో పడ్డారు.

చివరకు వారిని రెస్క్యూ టీం వచ్చి కాపాడవలసి వచ్చింది.ఇంతకీ ఏం జరిగిందంటే.

Advertisement

విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా ఉన్న ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే .ఓ చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిందని తెలుసుకున్న గ్రామస్తులు పోలోమని అక్కడకు పరుగులు తీశారు.అందరూ బావి చుట్టూ గుమిగూడారు.

దీంతో బావిచుట్టూ ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది.ఈ కారణంగా సుమారు నలభై మంది గ్రామస్తులు బావిలో పడ్డారు.

విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది చెమటోడ్చగా.అర్ధరాత్రి వరకు 23 మందిని కాపాడగలిగారు.అందులో నుంచి 13 మందిని ఆస్పత్రికి తరలించారు.

కాగా ఎవరైతే చిన్నారిని చూసేందుకు వీరంతా బావి వద్దకు వెళ్లారో ఆ చిన్నారి ఇంకా బావిలోనే ఉందని పోలీసులు తెలిపారు.సదరు చిన్నారిని ఏమైనా గాయలయ్యాయా లేదా తెలియడం లేదని పోలీసులు ప్రకటించారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

కాగా ఈ దుర్ఘటనలో ఇప్పటికే నలుగురు వ్యక్తుల శవాలు వెలికితీశారు.ఇంకా మిగతా వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

Advertisement

ఈ ప్రమాద ఘటనపై మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ప్రమాదం గురించి సమక్షిస్తూనే ఉన్నారు.

ఇది విన్న ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అని నిట్టూరుస్తున్నారు.చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

తాజా వార్తలు