ప్రపంచంలో మొదటిసారి రోబోట్స్ తయారుచేసిన 3డీ వంతెన... ఎక్కడంటే..?

ప్రపంచంలోనే మొదటి సారిగా 3డి ప్రింటెడ్ స్టీల్ వంతెనను నెదర్లాండ్స్ రాజధానిలో నిర్మించారు.ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.

ఈ వంతెన నిర్మాణం మనుషులు కాకుండా ఒక రోబోట్ చేసింది.ఈ వంతెన నిర్మాణం కొరకు దాదాపు 4500 కిలోల ఉక్కు అవరం అయిందట.

ఈ వంతెనను ఆమ్స్‌టర్‌ డ్యామ్‌ లోని ఒక పురాతన కాలువపై ఏర్పాటు చేశారు.అసలు 3డి ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించబడ్డ ఈ వంతెన ప్రత్యేకత ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

ఈ వంతెన పొడవు 12 మీటర్ల దాక ఉంటుంది.ఈ వంతెనను 4 రోబోలు కలిసి తయారు చేయడం విశేషం అనే చెప్పాలి.

Advertisement

అలాగే వంతెన పూర్తి కావడానికి సుమారు 6 నెలల సమయం పట్టింది.ఆ తరువాత ఈ వంతెనను ఒక పడవ సహాయంతో నది మధ్యలోకి తీసుకుని వచ్చి ఆ తరువాత ఒక క్రేన్ సహాయంతో కాలువపై ఉంచారు.

ఈ వంతెన నాణ్యతని తనిఖీ చేసే సెన్సార్ సంస్థ ఈ స్టీల్ బ్రిడ్జికి ఎంఎక్స్ 3డి అని పేరు పెట్టింది.అలాగే ఈ వంతెనలో డజనుకు పైగా సెన్సార్లు ఉన్నాయట.ఆ సెన్సార్ల సహాయంతో వంతెన బలాన్ని తెలుసుకుని అప్పుడు దానిని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచారు.

ఈ సెన్సార్లు ఎప్పటికప్పుడు వంతెన కండిషన్ ను పరిశీలిస్తూ ఉంటాయి.ఎప్పుడైనా వంతెన దెబ్బతింటే వెంటనే సమాచారం అందచేస్తాయి.భవిష్యత్ లో నిర్మించే వంతెనలకు కూడా ఇటువంటి టెక్నాలజీ అందించవచ్చని నిర్మాణ సంస్థ పేర్కొంది.3డి ప్రింటెడ్ స్టీల్ చాలా బలంగా ఉంటుందని నిర్మాణ సంస్థ ఇంజనీర్ గిరోలామీ తెలిపారు.3డి ప్రింటింగ్ అనేది ఒక సరికొత్త టెక్నాలజీ.సాధారణ ప్రింటర్‌ కు సిరా, కాగితం అవసరం అవుతాయి.

కానీ 3డి- ప్రింటర్‌ తో మనం సృష్టించిన వాటి పరిమాణం, రంగు, ఆకారం కూడా నిర్ణయించవచ్చు.తర్వాత రోబోట్లు వస్తువులను తయారుచేసే పనిలో ఉంటాయి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు