3వేల లీట‌ర్ల మ‌ద్యం నేల పాలు.. నెట్టింట్లో వీడియో వైర‌ల్‌

ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిన తరువాత తాలిబన్ చేతుల్లోకి వెళ్లిపోయింది.దీంతో ప్రస్తుతం అక్కడ వారు చెప్పిందే శాసనం.

ఆప్ఘన్‌లో తాలిబన్లు అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.మహిళలపై హింస, దాడులు పెరిగిపోయాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

బాలికలు చదువుకోవడానికి వీల్లేదని ఇటీవల తాలిబన్లు పత్వా కూడా జారీ చేశారు.అలాగే ప్రతి ముస్లిం యువతి తప్పనిసరిగా బురఖా ధరించాలని స్పష్టం చేసింది.

దీంతో అంతర్జాతీయ సమాజం నుంచి తాలిబన్లకు తీవ్ర వ్యతిరేకత మొదలైంది.అయితే కొన్ని విషయాల్లో మాత్రం ప్రజలకు మేలు చేస్తోంది అక్కడ ప్రభుత్వం.

Advertisement

తాజాగా అక్రమ మద్యంపై తాలిబన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది.ఆ దేశ గూఢచారి సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఇంటెలిజెన్స్ ఏజెంట్ల బృందం సుమారు 3 వేల టీటర్ల మద్యాన్ని కాలువలో పారబోసింది.

ఈ ఘటన కాబుల్‌లో చోటుచేసుకుంది.ఇందుకు  సంబంధించిన వీడియోను ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (జీడీఐ) విడుదల చేసింది.

వీడియో ప్రకారం.ఇంటెలిజెన్స్ ఏజెంట్లు బ్యారెళ్లలో నిల్వ ఉన్న మద్యాన్ని కాలువలో పారబోస్తున్నారు.

ఆఫ్ఘన్ రాజధాని కాబుల్‌లో అకస్మిక సోదాలు జరిపిన ఏజెంట్లు.అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న డీలర్లను అరెస్ట్ చేశారు.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
రామ్ చరణ్ ఆ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు..?

అలాగే అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు.

Advertisement

ఆఫ్ఘన్‌లో ఏన్నో ఏళ్ల నుంచి మద్యంపై నిషేధం విధించారు.అక్కడ ముస్లింలు మద్యం తయారీ చేయడం, విక్రయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది.ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఆఫ్ఘన్‌లో మద్యం వినియోగంపై తాలబన్లు తీవ్ర వ్యతిరేకతో ఉన్నారు.ఇలా కొన్ని విషయాల్లో తాలబన్లు మంచి చేసినా.

చాలా వరకు నిరంకుశ పాలనను కొనసాగిస్తున్నారు.అక్కడ వినోదంపై కూడా నిషేధం విధించారు.

ఆప్ఘన్ వ్యాప్తంగా థియేటర్లను మూసివేయించారు.అలాగే అమ్మాయిలు ఆటల్లో పాల్గొనకుండా కూడా నిషేధం విధించారు.

తాజా వార్తలు