ఆందోళనల మధ్యలో అంబులెన్స్...దారి ఇచ్చి అబ్బురపరిచిన జనం

గత కొద్దీ రోజులుగా హాంకాంగ్ లో ఆందోళనలు అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.

నేరస్తులను చైనాకు అప్పగించడం పై గత కొద్దీ రోజులుగా అక్కడ ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరడం తో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

అయితే ఇంత ఆందోళనల లో కూడా హాంకాంగ్ లో ఒక అపూర్వ ఘట్టం చోటుచేసుకుంది.వేలమంది నిరసనకారులు అంబులెన్స్ కు క్షణాల్లో దారి ఇచ్చి అబ్బురపరిచారు.

నేరస్తులను చైనా కు అప్పగించే బిల్లుకు సంబంధించి ప్రజలు వేల సంఖ్యలో ఆందోళనలకు దిగారు.ఆ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అంటూ ప్రజలు గత కొద్దీ రోజులుగా ఆందోళనలు చేపట్టారు.

ఈ క్రమంలో అనుకోకుండా అంబులెన్స్ రావాల్సిన పరిస్థితి రావడం తో ఆందోళనకారులు అందరూ కూడా ఒక్కసారిగా పక్కకు తప్పుకొని మరి అంబులెన్స్ కు దారి ఇచ్చి ప్రాణం విలువను చాటి చెప్పారు.ఆదివారం జరిగిన ఈ నిరసనల కార్యక్రమంలో భాగంగా ఒక నిరసనకారుడు స్పృహ కోల్పోయాడు.

Advertisement

దీనితో సహచరులు అంబులెన్స్ కు ఫోన్ చేయడం తో వెంటనే అక్కడకి చేరుకొని అతివేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లడానికి నిరసనకారులు వెంటనే దారి ఇచ్చి ప్రాణం విలువను కాపాడారు.గత కొద్దీ రోజులుగా హాంకాంగ్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ క్రమంలో భారీ గా పోలీసులు మోహరించి అక్కడ పరిస్థితులను అదుపు చేసే ప్రయత్నం చేసేందుకు చూస్తున్నా పరిస్థితులు మాత్రం రోజు రోజుకు చేయి దాటిపోతూనే ఉంది.

ఈ క్రమంలో అక్కడ ఆదివారం కూడా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు