100 కోట్ల రూపాయలున్న కంటైనర్‌ నడి రోడ్డు మీద ఆగిపోయింది.. ఆ విషయం జనాలకు తెలిసి...!  

100cr Money Container Stops In The Road-

రోడ్డు మీద వంద రూపాయలు కనిపిస్తేనే జనాలు వెంటనే దాన్ని తీసుకునేందుకు ఎగబడతారు.అలాంటిది ఏకంగా వంద కోట్ల రూపాయలు నడి రోడ్డు మీద ఉంటే పరిస్థితి ఏంటీ.

100cr Money Container Stops In The Road-

ఆ వంద కోట్ల గురించి జనాలకు తెలిస్తే మరేమైనా ఉందా.నిమిషాల్లో రచ్చ రచ్చ.ఎవరికి అందిన కాడికి వారు దోచేసుకుని, దాచేసుకుంటారు.రోడ్డుమీద ఏదైనా వస్తువులను రవాణ చేస్తున్న వాహనాలు ఆగిపోవడం లేదంటే కింద పడటం జరుగుతుంది.

అలాంటప్పుడు స్థానిక జనాలు ఆ వస్తువులను ఇష్టం వచ్చినట్లుగా తీసుకు వెళ్లడం చేస్తారు.

100cr Money Container Stops In The Road-

తాజాగా వంద కోట్ల నోట్ల కట్టలను రవాణ చేస్తున్న ఒక వెయికిల్‌ నడి రోడ్డు మీద ఆగిపోయింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే… తమిళనాడులోని చెన్నై రిజర్వ్‌ బ్యాంక్‌ నుండి అధికారులు వంద కోట్ల రూపాయలను హుస్నూరు ఎస్‌బి బ్యాంక్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.ఎప్పటిలాగే భారీ కంటైనర్‌ను ఇందుకోసం ఉపయోగించారు.

అయితే వంద కోట్ల రూపాయల కంటైనర్‌ వెళ్తుందనే సంగతి ఎవరికి తెలియకుండా ముందస్తుగానే జాగ్రత్త పడ్డారు.అంతా కూడా అనుకున్నట్లుగా సాఫీగా సాగిపోతుందని భావిస్తున్న సమయంలో కంటైనర్‌ వెయికిల్‌ మొరాయించింది.


ప్రయాణిస్తున్న కంటైనర్‌ వెనుక ఒక ఎస్సై మరియు నలుగురు కానిస్టేబుల్స్‌ ఉన్నారు.కంటైనర్‌ ఆగిపోగానే షాక్‌ అయిన వారు వెంటనే డ్రైవర్‌ వద్దకు వెళ్లి ఏమైందంటూ అడిగారు.

ఇంజిన్‌లో సమస్య అంటూ చెప్పగానే మెకానిక్‌ను పిలిపించారు.ఆ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి 20 మందిని భద్రత కోసం పిలిపించారు.


దాదాపు మూడు గంటల పాటు ఆ కంటైనర్‌ నడి రోడ్డు మీద ఆగిపోయింది.పోలీసులు బిక్కు బిక్కు మంటూ ఆ డబ్బుకు కాపాలా కాశారు.

మూడు గంటల తర్వాత ఆ కంటైనర్‌ మళ్లీ ప్రయాణం మొదలు పెట్టింది.ఇది రాత్రి సమయంలో జరిగింది కనుక ఏ ఇబ్బంది లేదు.

అదే పగలు సమయంలో జరిగి ఉంటే పరిస్థితి ఏంటి అంటూ ఉన్నతాధిరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.చివరకు సాఫీగా సాగడంతో అంతా కూడా ఊరిపి పీల్చుకున్నారు.

.

తాజా వార్తలు