మహేష్ బాబు సినిమా.. ఏకంగా రూ.10 కోట్లతో విలాసవంతమైన ఇల్లు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.కాగా ఎట్టకేలకు ఈ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు మహేష్ బాబు.

ఈ క్రమంలోనే ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి రాజమౌళి దర్శకత్వంలో జరిగే షూటింగ్లో పాల్గొనాలి అని ఎంతో ఎదురు చూస్తున్నాడు.

10 Crore Set For Mahesh Babu Movie ,mahesh Babu Movie, Mahesh Babu, Madhura Meen

అంతేకాకుండా త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ కోసం మహేష్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అన్ని సక్రమంగా జరిగి ఉంటే ఈపాటికి ఈ సినిమా విడుదల అయ్యేది అని చెప్పుకొస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక ఖరీదైన సెట్ బై వేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement
10 Crore Set For Mahesh Babu Movie ,mahesh Babu Movie, Mahesh Babu, Madhura Meen

ఏ ఎస్ ప్రకాష్ నేతృత్వంలో ఈ సెట్ పనులు జరగనున్నాయట.అందుకోసం దాదాపుగా 10 కోట్ల రూపాయలతో ఒక ఇంటిని సెట్ వేస్తున్నట్టు తెలుస్తోంది.సినిమాలో హీరో మహేష్ బాబు కోసం ఆ సెట్ ని వేస్తున్నట్లు తెలుస్తోంది.

10 Crore Set For Mahesh Babu Movie ,mahesh Babu Movie, Mahesh Babu, Madhura Meen

అంతేకాకుండా ఆ సెట్ అత్యంత విలాసవంతంగా ఉండబోతోంది అని తెలుస్తోంది.అయితే మహేష్ బాబు సినిమాల కోసం ఖరీదైన భారీ సెట్ లు వేయటం అన్నది ఇదేం కొత్త కాదు.ఎందుకంటే గతంలో మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమాలో ఏకంగా మధుర మీనాక్షి టెంపుల్ సెట్ ను వేసిన విషయం తెలిసిందే.

అప్పట్లోనే కోట రూపాయల బడ్జెట్ తో ఆ సినిమా సెట్ వేశారు.మరి ఇప్పుడు 10 కోట్లతో సెట్ వేయబోతున్న ఈ ఇల్లు ఎంత విలాసవంతంగా ఉంటుందో చూడాలి మరి.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు