విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు

విశాఖ నుంచి పరిపాలన ఉండబోతుందని స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.ఈ మేరకు విశాఖలో ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో భాగంగా సుమారు 2.27 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలు అందుబాటులోకి వచ్చాయి.మొత్తం 35 శాఖలకు కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు శాఖల కార్యదర్శులకు భవనాలు కేటాయించింది.కాగా అధికారుల కమిటీ సిఫార్సు మేరకు ప్రభుత్వ శాఖలకు భవనాల కేటాయింపు జరిగింది.

ఈ మేరకు కార్యాలయ, విడిది అవసరాలకు విశాఖలో భవనాలు కేటాయించగా మిలీనియం టవర్స్ లోని ఏ, బీ బ్లాక్ భవనాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, రుషికొండ, చినగదిలి, ఎండాడ ఇతర ప్రాంతాల్లో భవనాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి
Advertisement

Latest Latest News - Telugu News