వచ్చే లోకసభ సమావేశాలలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం (కామన్ సివిల్ కోడ్) బిల్లు ని ప్రవేశపెట్టాలని చూస్తున్న భాజపా ఆ బిల్లును ఎలాగైనా నెగ్గించుకునేందుకు తన శాయ శక్తులా ప్రయత్నిస్తుంది.అందులో భాగంగానే బిల్లు కు కు మద్దతు ఇచ్చే వర్గాల కోసం అన్వేషిస్తుంది తమకున్న సంఖ్యా బలం తో లోకసభ లో బిల్ పాస్ అయినా రాజ్యసభ లో మద్దత్తు కోసం బాజాపా ప్రయత్నిస్తుంది.
ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నామని స్పష్టంగా ప్రకటించాయి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వమని బహిరంగంగా ప్రకటించారు.ఇప్పుడు చర్చ తెలుగు రాష్ట్రాల పైకి వెళ్ళింది .

తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేది లేదని ,ఇది ప్రజలను మతాలు వారీగా విడగొట్టే చర్య అని, కేవలం ఎన్నికల లబ్ధి కోసమే బిజెపి ఇప్పుడు ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటుందని విమర్శించారు .ఎంఐఎం అధినేత ఓవైసీ తో సమావేశం తర్వాత కేసీఆర్ నిర్ణయాన్ని ప్రకటించారు.ఇది ముఖ్యంగా ముస్లింలను ఇబ్బంది పెట్టేందుకు ఉద్దేశించిన బిల్లు అని భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారత దేశంలో ప్రజలందరికీ ఒకేచోట్టం అమలు చేయడం సాధ్యం కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు .

అయితే ఇప్పుడు కేంద్రంతో సఖ్యత మెయింటైన్ చేస్తూ దాదాపు వారు ప్రవేశపెట్టిన అన్నీ బిల్లులకు మద్దతు ఇస్తూ వచ్చిన జగన్ ఈ కామన్ సివిల్ కోడ్ బిల్లుపై ఎలా స్పందిస్తారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది .ఇప్పటికే తన ఢిల్లీ పర్యటనలో ఈ బిల్లుకు మద్దతు ఇస్తామని జగన్( YS Jagan Mohan Reddy ) అంగీకరించారని వార్తలు వచ్చాయి .అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లుగా తెలుస్తుంది.ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలలో ముస్లింలు మైనారిటీ వర్గాలు జగన్కు అండగా నిలబడ్డారు, ఇప్పుడు తమకు వ్యతిరేకమని అందరూ భావిస్తున్న ఈ కామన్ సివిల్ కోడ్ బిల్లు( Uniform Civil Code )కు జగన్ మద్దతు ఇస్తే ఆయా వర్గాలు జగన్కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి.ఈ దిశగా ఇప్పటికే కేసీఆర్ జగన్కు హితబోధ చేశారని కేంద్ర పెద్దలు మెప్పుకోసం ఇలాంటి బిల్లుకు మద్దతు ఇస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీకి పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని హితవు చెప్పారని వార్తలు వస్తున్నాయి .మరి మరి కేంద్ర పద్ధతి పెద్దల మద్దతు కన్నా వచ్చే ఎన్నికల్లో గెలవటమే ముఖ్యమైన జగన్ భావిస్తారో లేక ఇచ్చిన మాట ప్రకారం బిల్లుకు మద్దతు ఇస్తారు వేచి చూడాలి.