మీడియా "పవర్" పవన్ కి తెలిసొచ్చిందా ..?

అందరూ అనడం కాదు కానీ పవన్ కళ్యాణ్ నిజంగానే తన క్లారిటీ లేని చేష్టలతో రియల్ అజ్ఞానవాసి అని నిరూపించుకుంటున్నాడు.

పవన్ లో ఆవేశం ఉంది కానీ సరైన ఆలోచనలు మాత్రం లేవని ఎప్పటి నుంచో ఆయన మీద వస్తున్న ఆరోపణలు.

వాటికి బలం చేకూర్చేలా పవన్ వ్యవహారాలు చేస్తున్నాడు.దీనికి నిదర్శనమే పవన్ వర్సెస్ మీడియా.

కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వచ్చి అందరిని దడదడలాడించిన నటి శ్రీ రెడ్డి ఆ తరువాత ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ సంచలనం సృష్టించింది.ఆఖరికి పవన్ కళ్యాణ్ ఆ వివాదంలో చిక్కుకున్నాడు అది కాస్తా ముదిరి మీడియా వర్సెస్ పవన్ అనే స్థాయికి గొడవ ముదిరిన సంగతి తెలిసిందే.

ఒక రాజకీయ పార్టీ స్థాపించి .ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్న రాజకీయ నాయకుడికి న్యూస్ ఛానెల్స్ తో ఎంత అవసరం ఉంటుందో ముందే తెలియదా .? అవన్నీ మర్చిపోయి ఎవరో రెచ్చగొడితే రెచ్చి పోయి మీడియా మొత్తాన్ని ఉతికి ఆరేసి తాను ఎంత ధైర్యవంతుడినో నిరూపించుకోవాలనుకున్నాడు.అయితే వాస్తవం కొద్దిరోజులకే అర్ధం అయిపోయింది.

Advertisement

జనాల్లో ఫోకస్ అవ్వాలంటే మీడియా అవసరం బాగా ఉందని తీరిగ్గా గుర్తించి నాలుక కరుచుకున్నాడు.అందుకే మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు.

మీడియాకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.తాను బహిష్కరించమని పిలుపునిచ్చిన ఛానెల్స్ కే పవన్ ఇంటర్వ్యూలు ఇస్తూ .అభిమానులను, ప్రజలను వెర్రి వెంగళప్పలను చేస్తున్నాడు.ఏ ఛానెల్స్ ని అయితే చూడొద్దని ప్రజలకు, అభిమానులను విజ్ఞప్తి చేసిన పవన్ ఇప్పుడు వాటితోనే అంటకాగడం పవన్ లో లోపించిన నిబద్ధతను స్ప్రష్టంగా తెలియజేస్తోంది.

ఒక సినీ సూపర్ స్టార్.ఒక పార్టీకి అధ్యక్షుడు అయిన వ్యక్తి చెప్పే మాటలకు విశ్వసనీయత ఉండాలి.కోట్లాది మంది అనుసరించే లీడర్, తాను ఇచ్చిన పిలుపుకు కట్టుబడి ఉండాలి.

అప్పుడే ఆ మాటకు ఒక విలువ ఉంటుంది.అందుకే ఆవేశపడి ముందు ఆలోచన కూడా చేయాలి పవన్ లా క్లారిటీ మిస్ అయితే ప్రజాక్షేత్రంలో బొక్కబోర్లా పాడడం ఖాయం.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు