“మల్లాది” కి “మైండ్ బ్లాక్” అయ్యే ఆన్సర్ ఇచ్చిన “జగన్”..

జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా టూర్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఆ నిర్ణయాలలో భాగంగా కొంతమంది సీనియర్స్ జగన్ నిర్ణయాలతో తెగ టెన్షన్ పడుతున్నారట.

 Ysrcp Leader Mallaadi Vishnu-TeluguStop.com

అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు అంటూ జగన్ పై లోలోపల తెగ మందిపడుతున్నారట.తమ అనుచరుల వద్ద తమ భాదని వెళ్లగక్కుతున్నారు అని తెలుస్తోంది.వైఎస్ బ్రతికున్న సమయంలో విజయవాడలో తన స్థానాన్ని ఎంతో సుస్థిరం చేసుకున్న ఆ నేత ఇప్పుడు తెగ ఆందోళన చెండుతున్నారట ఇంతకీ ఎవరా నేత అంటే మల్లాది విష్ణు అనే చెప్పాలి

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది విష్ణు… కాంగ్రెస్ నుంచి వీడి వైసీపీలో చేరిన తరువాత మళ్లీ అదే స్థానం నుండీ పోటీ చేయాలని భావిస్తున్నారు.అంతేకాదు ఈ విషయంలో జగన్ నుంచీ స్పష్టమైన హామీ కూడా తీసుకున్నారు…అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పరిణామాలు మారిపోవడంతో… మల్లాది విషయంలో జగన్ నిర్ణయం కూడా మారిపోయిందని తెలుస్తోంది.ప్రస్తుతం కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు…షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట…విజయవాడలోని మూడు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేశారని తెలుస్తోంది.

జగన్ సెలెక్ట్ చేసిన వారిలో విజయవాడ తూర్పు నుంచీ యలమంచిలి రవి, సెంట్రల్ నుంచి వంగవీటి రాధా, పశ్చిమ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ లకి జగన్ అవకాశం కలిపించారని తెలుస్తోంది.

దాంతో మల్లాదికి ఈ విషయం ఊహించని పరిణామం అని చెప్పవచ్చు.అయితే కాంగ్రెస్ ని వీడి జగన్ వెంట నడిచినందుకు ఇదేనా నాకు ఇచ్చే గౌరవం అంటూ మల్లాది ఫైర్ అవుతున్నారని కూడా తెలుస్తోంది.

ఇదిలాఉండగా పవన్ మల్లాది కి ఓ సలహా కూడా ఇచ్చారట అదేంటంటే.

వారికి టిక్కెట్లు ఇవ్వక తప్పలేదు మీరు ఇవేమీ పట్టించుకోకుండా వంగవీటి రాధా గెలుపు కోసం కృషి చేయాలని… పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మీకు ఉన్నతమైన స్థానం ఇస్తానని చెప్పారట జగన్.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఇంతకంటే ఏమీ చేయలేనని వారికి టిక్కెట్లు ఇవ్వక తప్పలేదని మీరు ఒప్పుకొని పక్షంలో కృష్ణా నుంచీ మీకు ఒక సీటు ఇస్తానని అన్నారట జగన్ అయితే ఎంతో పట్టు ఉన్న స్థానం వదిలేసి పట్టులేని స్థానం నుంచీ పోటీ చేయలేను అని మల్లాది తెగేసి చెప్పారట దాంతో ఇప్పుడు విజయవాడ రాజకీయాలు మరో మారు వేడెక్కనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube