దేశ రాజకీయాల్లో స్త్రీలకు 33% రిజర్వేషన్ ఉండాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ధర్నాలు చేసిన బారసా అదినేత కేసీఆర్( KCR ) తనయ కవితపై ( kavitha )ఇప్పుడు అనేక విమర్శలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల లిస్టును ప్రకటించిన కేసీఆర్ మొత్తం 115 స్థానాలు కానీ కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే అవకాశం ఇవ్వటం ఇప్పుడు కవితకు సమీకరణాలు వ్యతిరేకంగా మారినట్లుగా తెలుస్తుంది.ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ చక్కబెట్టుకోమంటూ కేవలం రాజకీయ ప్రయోజనా ల కోసం మాత్రమేమహిళా కార్డు ప్రయోగించారని మహిళా అభ్యుదయం పై తండ్రికి సర్ది చెప్పుకోవడంలో విఫలమైన కవిత ఇతర పార్టీలకు శుద్ధులు చెప్పడం ఆశ్చర్యంగా ఉందంటూ వైఎస్ఆర్టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) విమర్శించారు.
![Telugu Dk Aruna, Kavitha, Telangana, Ys Sharmila-Telugu Political News Telugu Dk Aruna, Kavitha, Telangana, Ys Sharmila-Telugu Political News](https://telugustop.com/wp-content/uploads/2023/08/Kavitha-comments-boomerangb.jpg)
బాజాపా కీలక నాయకురాలు డీకే అరుణ ( DK Aruna )కూడా ఎదుటివారికి చెప్పడానికే మాత్రమే నీతులు ఉన్నాయని రాజకీయ విలువలు అంటూ చిలక పలుకులు పలికిన కవిత నోరు ఇప్పుడు మూగబోతుందంటూ విమర్శించడం గమనార్హం.ఏది ఏమైనా గత కొన్ని గత కొన్ని సంవత్సరాలుగా మహిళలు రాజకీయాల్లో కీలక స్థానం పోషిస్తున్నప్పటికీ తెలంగాణలో మాత్రం మహిళా రిజర్వేషన్లు అతి తక్కువ సంఖ్య లోనే అమలవుతున్నట్లుగానే చూడాలి.తన మొదటి క్యాబినెట్ విస్తరణలో ఒక మహిళా మంత్రి కూడా అవకాశం ఇవ్వని కేసీఆర్ విమర్శలకు జెడిసి రెండవ విడతలో మాత్రం కొంతమందికి అవకాశం ఇచ్చారు.అయితే దేశ రాజకీయ సగటు చూసుకున్నా తెలంగాణ సగటు మహిళలకురాజకీయ ప్రాతినిధ్యంలో వెనకబడే ఉన్నట్లుగా చెప్పవచ్చు.
మహిళలకు రాజకీయ అధికారం విషయంలో కేసీఆర్ .వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తూ కేసీఆర్ ని నిలదీస్తున్నాయి .పక్క తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ మాత్రం ఈ విషయం లో తెలంగాణ కన్నా ముందు ఉండటం గమనార్హం .మరి ప్రతి పక్షల విమర్శల పై కవిత ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి .