స్పీడ్ పెంచిన షర్మిల ! అధికార ప్రతినిధుల నియామకం .. కీలక నిర్ణయాలు

మొన్నటి వరకు పెద్దగా సందడిలేని వైయస్ షర్మిల పార్టీ కార్యకలాపాలు మళ్ళీ ఇప్పుడు ఊపందుకున్నాయి.తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్యపై మొదటగా స్పందించారు.

 Sharmila Appointed Party Spokespersons, Ys Sharmila, Telangana, Jagan, Kcr, Trs,-TeluguStop.com

దీక్షలు చేశారు.ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.

మళ్లీ అదే అంశంతో యాక్టివ్ అయ్యారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ తీరు పైన విమర్శలు చేస్తూ హడావుడి చేస్తూ వచ్చారు.

ఇక నిన్ననే ఆమె పార్టీ పేరును ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేశారు.  జూలై 8 వ తేదీన వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని తాము పెట్టబోయే పార్టీ వైఎస్ఆర్టీపీ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు.

పార్టీకి అధ్యక్షుడిగా రాజగోపాల్ అనే వ్యక్తిని నియమించబోతున్నారు.ఈ సందర్భంగా తాను స్థాపించబోయే పార్టీకి తొమ్మిది మంది అధికార ప్రతినిధులను షర్మిల నియమించారు.ఇందిరా శోభన్, సయ్యద్ ముజ్ నాథ్ అహ్మద్, పిట్ట రామ్ రెడ్డి, కొండ రాఘవ రెడ్డి, ఏ ఊరి సోమన్న , తేడి దేవేందర్ రెడ్డి, బిశ్వ రవీందర్, మతిన్ మజదద్ది, భూమిరెడ్డి పొన్నార్ వీరంతా షర్మిల పార్టీ తరఫున అధికార ప్రతినిధిగా నియమించినట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది.ఇక రాజకీయంగా మరింత యాక్టివ్ అవ్వడమే కాకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం పైన, బిజెపి, కాంగ్రెస్ పైనా విమర్శలు చేస్తూ వేడి పెంచాలని షర్మిల చూస్తున్నారు.

ఇక రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించడంతో పాటు, రాజకీయంగా మరింత యాక్టివ్ అయ్యే విధంగా షర్మిల ప్లాన్ చేసుకుంటున్నారు.

Telugu Jagan, Sharmila Spoke, Telangana, Ys Sharmila, Ysrcpt-Telugu Political Ne

2023 ఎన్నికలే టార్గెట్ గా ఆమె ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో అమలు కాకుండా మిగిలిపోయిన వాటిని హైలెట్ చేసుకుని ప్రజల్లో బలం పెంచుకోవాలని భావిస్తున్నారు.రాబోయే రోజుల్లో పార్టీ కమిటీలను నియమించి టిఆర్ఎస్ కు ధీటుగా తమ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.

ఇప్పటికే షర్మిల తాను చేపట్టబోయే పాదయాత్ర రూట్ మ్యాప్ నూ సిద్ధం చేసుకున్నారట.బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుని మరింత బలోపేతం అవ్వాలని, టిఆర్ఎస్, బిజెపి కాంగ్రెస్ తదితర పార్టీలో ఉన్న అసంతృప్తు లను గుర్తించి  వారిని తమ పార్టీలో చేర్చుకోవాలనే లక్ష్యంతో షర్మిల ముందుకు వెళ్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube