బిగ్ బాస్ ఫాన్స్ కు పెద్ద షాక్.! బాబు గోగినేనిపై పోలీస్ కేస్.! షో నుండి బయటకా.?

బిగ్ బాస్ హౌజ్‌లో గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయి.

లగ్జరీ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ‘చెరకు రసం ఫ్యాక్టరీ’ టాస్క్‌తో రెండు బ్యాచ్‌లుగా విడిపోయిన హౌజ్‌మేట్స్ గెలుపు కోసం ఎవరి పన్నాగాలు వాళ్లు పన్నుతున్నారు.

గ్రీన్ టీమ్ మీద గెలవడానికి ఎల్లో టీమ్.ఎల్లో టీమ్‌ను ఎలాగైనా ఓడించాలని గ్రీన్ టీమ్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

షో ఇంత రసవంతరంగా సాగుతున్న టైం లో భారీ షాక్ ఎదురైంది.బిగ్ బాస్ 2 కంటెస్టెంట్, హేతువాది బాబు గోగినేనిపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసారు.

వివరాల లోకి వెళ్తే.!

Advertisement
FIR Filed Against Babu Gogineni For Hurting Religious Sentiments-బిగ్ �
Fir Filed Against Babu Gogineni For Hurting Religious Sentiments

కేవీ నారాయణ, మరికొందరు ఇచ్చిన ఫిర్యాదుతో అతనిపై దేశ ద్రోహంతోపాటు వివిధ సెక్షన్ల కింద మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆధార్ చట్టాన్ని ఉల్లంగిస్తూ ఔత్సాహికుల ఆధార్ సమాచారాన్ని సేకరిస్తున్నారని, హేతువాద ప్రచారం కోసం నిధులు దుర్వినియోగం పరుస్తున్నారని కేవీ నారాయణ ఫిర్యాదులో పేర్కొన్నారు.గోప్యంగా ఉంచాల్సిన ఆధార్‌ సమాచారాన్ని బాబు గోగినేని, ఆయన అనుచరులు తమ సంస్థల ద్వారా పక్క దేశాలకు అందజేస్తున్నారని ఆరోపించారు.

ఇది దేశ భద్రతకు కూడా ప్రమాదంగా మారుతుందని వారు ఫిర్యాదులో తెలిపారు.మాదాపూర్‌ పోలీసులు బాబు గోగినేనిపై 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో ఉన్న ఆయన న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోక తప్పదు.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది హాట్ టాపిక్ అయింది.

రాజమౌళి స్థాయిని తగ్గించేలా నీచమైన ఆరోపణలు.. మరీ ఇంత దారుణమా?
Advertisement

తాజా వార్తలు