పైసా వసూల్ కథ ఇదేనా ?

పూరీ జగన్నాథ్ సినిమాలు అంటే మనకు వెంటనే మరియు మొదట గుర్తొచ్చే సినిమా పోకిరి.

అప్పటికీ ఇప్పటికీ టికెట్ ధరలు, తెలుగు సినిమా మార్కెట్ చాలా పెరిగి పోయింది కానీ ఇప్పటికీ ఇటు మహేష్ బాబు కెరీర్ లో అటు పూరి జగన్నాథ్ కెరీర్ లో నే కాదు తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్లలో పోకిరి ఒకటి.

కమర్షియల్ సినిమాల్లో కల్ట్ క్లాసిక్ గా నిలిచింది పోకిరి.ఓ తరాన్ని మహేష్ బాబు వైపుకు తిప్పిన సినిమా ఇది.పోకిరి అంతటి సంచలన విజయాన్ని సాధించడానికి కారణం మహేష్ బాబు పాత్ర మాత్రమే కాదు ఆ సినిమా పతాక సన్నివేశాల్లో వచ్చే ట్విస్ట్ ఆ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది.అప్పటిదాకా అల్లరి చిల్లరగా క్రిమినల్ గా తిరిగిన మహేష్ ఒక్కసారిగా పోలీస్ అని తెలిసే సరికి ప్రేక్షకుల మతులు పోయాయి.

ఆ సినిమాను ప్రేరణగా తీసుకొని ఎన్నో సినిమాలు ఆ తరువాత వచ్చాయి.పూరీజగన్నాథ్ కూడా కొంతకాలం పాటు ప్రభావం నుంచి బయటకు రాలేక పోయారు.అయితే మళ్లీ పోకిరి లాంటి విజయం మాత్రం ఆయనకు దక్కలేదు.

కొత్తగా తీసిన పైసా వసూల్ ప్రోమోలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.పూరి జగన్నాథ్ మార్క్ డైలాగులు బాలకృష్ణ నోటినుంచి వింటుంటే ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలగడం ఖాయం.

Advertisement

ఈ సినిమాకు సంబంధించి ఒక కథ ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతోంది.అందో నిజమెంత, ఎంతవరకు అబద్ధం, మనకు తెలియదు కానీ ఆ కథ ఏంటో మీకు చెబుతున్నాము.

ఇది చాలా సింపుల్, ఓ రకంగా చెప్పాలంటే పోకిరిని రివర్స్ చేస్తే అదే పైసా వసూల్.పోకిరిలో మాఫియాలో పనిచేస్తూ క్రిమినల్ గా నటిస్తూ చివరికి తానొక పోలీస్ అని ఇంతకాలం ఒక ఆపరేషన్ లో ఉన్నాడని రీవీల్ చేస్తే, పైసా వసూల్ సినిమా లో హీరో ఒక పోలీసులా నటిస్తాడట.

కానీ నిజానికి అతనొక మాఫియా డాన్.అదే ట్విస్ట్ క్లైమాక్స్ లో రీవీల్ చేస్తారట.

మరి ఈ సినిమా కథ నిజంగానే ఇది లేదంటే ఇంటర్నెట్లో ప్రచారమయ్యే ఎన్నో రూమర్స్ లో ఒకటా అనే విషయం తెలియాలంటే సెప్టెంబరు1 దాకా ఆగాల్సిందే.

మరో బాహుబలి వస్తుందని ప్రకటన చేసిన రాజమౌళి.. ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్ అంటూ? 
Advertisement

తాజా వార్తలు