అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది వివదాస్పదమవుతుంది లేక సంచలనం అవుతుంది అయ్యి తీరాల్సిందే వీసాల పై ఆంక్షలు మొదలు.వలస జీవులని అక్రమ వలసదారులుగా నిర్భందించడం మొదలు ఇలా ప్రతీ విషయంలో ట్రంప్ పై సొంత ఇంటి నుంచీ వ్యతిరేకత మూటగట్టుకునే వాడు అయితే ఈ సారి కూడా ట్రంప్ మరో కీలక విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
అదేంటంటే.

డొనాల్డ్ ట్రంప్ కీలకమైన ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు…అమెరికా దేశీయ ఎన్నికల్లో విదేశీ సంస్థల మధ్యవర్తిత్వాన్ని నిరోధించడం అంతేకాక నేరానికి పాల్పడిన సంస్థలను కఠినంగా శిక్షించడమే లక్ష్యంగా ఈ ఆర్డర్‌పై ఆయన కీలకమైన సంతకం చేశారు.అమెరికా ఎన్నికల్లో వేలు పెట్టినట్టు రుజువైన నిందిత విదేశీ సంస్థలపై కఠినమైన ఆంక్షలు విధించనున్నారు.

అయితే ఎలాంటి ఆంక్షలు విధించాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదు కానీ డిపార్ట్‌మెంట్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ ట్రెజరీ ఈ ఆంక్షల విషయంలో ఎలాంటి విధానాలు అమలు చేయాలో నిర్ణయం తీసుకుంటుందని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వజర్ జాన్ బోల్టన్ తెలిపారు.అయితే నేరాలకి పాల్పడిన సంస్థల ఆస్తులను నిలుపుదల చేయడం, ఆర్థిక వ్యవహారాలపై పరిమితులు విధించడం…సంస్థల్లో అమెరికన్లు పెట్టుబడులు పెట్టకుండా చేయడం వంటి నిభందనలు చేయవచ్చు అని బోల్టన్ వెల్లడించారు .