కాంగ్రెస్ లో ఉంటూ బిగ్ స్కెచ్ వేస్తున్న రేవంత్

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనంగా తయారవుతోంది.

అయితే మొదటి నుండి కూటముల కుమ్ములాటలకు ప్రాధాన్యం ఇచ్చే కాంగ్రెస్ నేతలు పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టకపోవడమే ప్రస్తుత పార్టీ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది.

అయితే రేవంత్ పార్టీ బలోపేతానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో రేవంత్ కు మద్దతుగా ఎవరు లేని పరిస్థితులో కూడ కాంగ్రెస్ బలోపేతానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.అయితే రేవంత్ రెడ్డి ఇటీవల పాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.

అయితే కాంగ్రెస్ లోనే ఉంటూ భారీ స్కెచ్ వేయడానికి ప్రయత్నిస్తున్నాడు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వ్యక్తిగా తనను తాను స్థాయిని పెంచుకొని బలమైన రాష్ట్ర స్థాయి నేతగా ఎదగాలన్నది రేవంత్ వ్యూహం.

అయితే రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన తర్వాత కాంగ్రెస్ లో అవకాశం వచ్చినా రాకున్నా కొత్త పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో రేవంత్ ఉన్నట్టు సమాచారం.అయితే కాంగ్రెస్ లో కుమ్ములాటల నేపథ్యంలో రేవంత్ కు నాయకత్వం అప్పజెప్పడానికి సీనియర్ నాయకులు ఎవరు సుముఖంగా లేకపోవడంతో రేవంత్ ఒంటరిగా పోరాడాల్సి వస్తోంది.

Advertisement

అయితే ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు బలంగా నిర్ణయించుకోవాలనేది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు