ఈ అమెరికన్ మతిమరపు విలువ రూ. 1753 కోట్లు..

మతిమరుపు సహజంగా అందరికి ఉంటుంది.

హడావిడిగా ఉన్న సమయంలో చేతిలో ఉన్న వస్తువులను ఒక చోట పెట్టి అవసరం అయినపుడు వేరే చోట వెతుకుతూ ఉంటాం.

కాస్త అర్జెంట్ గా ఆ వస్తువు కావాల్సి వస్తే అప్పుడు పడే టెన్షన్ మాములుగా ఉండదు.ఇలాంటి అనుభవం అందరూ రుచి చూసి ఉంటారు.

ఇంకొందరు ఉంటారు.చేతిలో సెల్లు పెట్టుకుని ఇల్లు మొత్తం వెతికేస్తారు వాళ్ళు అదో టైప్.

ఇంకోరకం ప్రబుద్దులు కూడా ఉంటారు.ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇలాంటి వాళ్ళ గురించే.

Advertisement

వీళ్ళకు మతిమరుపుతో పాటు అదనంగా ఉండే వేరే అలవాటు ఏంటంటే బద్ధకం.ఈ రెండు లక్షణాలు కలగలిపిన ఓ వ్యక్తీ అమెరికాలో ఉన్నాడు.

ప్రస్తుతం సదరు వ్యక్తి తన బుర్ర బద్దలయ్యిపోయే ఆలోచనలో పడ్డాడు.సదరు వ్యక్తికి ఊహించని విధంగా భారీ సంపద వచ్చి పడింది.

కానీ కేవలం ఒక్క పాస్ వర్డ్ గుర్తు లేకపోవడం వలన అందులోంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేని దీన స్థితికి చేరుకున్నాడు.ఇంతకీ అసలేం జరిగిందంటే.

అమెరికాలో వాషింగ్టన్ కు చెందిన స్టీఫెన్ ధామస్ ప్రోగ్రామర్ గా పనిచేస్తున్నాడు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

డిజిటల్ కరెన్సీ ధర చాలా తక్కువగా ఉన్న సమయంలో 7000 బిట్ కాయిన్స్ కొలుగోలు చేశాడు.వాటి భద్రతా కోసం ఓ ఐరన్ కీ ఖాతాలో బద్రపరిచి ఓ పాస్ వర్డ్ పెట్టుకున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో అతడు కొన్ని బిట్ కాయిన్ విలువ ఒక్కొక్కటి రూ.25 లక్షలు పైగానే పలికింది.దాంతో అతడి మొత్తం కాయిన్స్ విలువ ఒక్క సారిగా రూ.1753 కోట్లకు చేరుకుంది.ఊహించని ఈ లక్కు తో ఉబ్బితబ్బిబ్బై న అతడు లాకర్ లో దాచుకున్న కాయిన్స్ తీసుకుందామని అనుకున్నాడు కానీ తనకున్న మతిమరుపు కారణంగా పాస్ వర్డ్ మర్చిపోయాడు.

Advertisement

అయితే ఈ పాస్ వర్డ్ ఓపెన్ చేయడానికి కేవలం 10 చాన్స్ లు మాత్రమే ఉంటాయి ఇప్పటికే అతడు 8 సార్లు పరీక్షించిన ఫలితం లేకపోయింది.ఇక రెండు అవకాశాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఒక వేళ ఈ రెండు అవకాశాలు మిస్ అయితే ఇక ఆబాక్స్ శాశ్వతంగా మూతబడిపోతుంది.దాంతో అతడు రూ.1753 కోట్లు పోగొట్ట్టుకున్నట్టే.

తాజా వార్తలు