మామూలు జ్వరం అనుకోకండి..భయంకరమైన వ్యాధి ఇది.! నిఫా వైరస్ 5 లక్షణాలు ఇవే.!

ఒకప్పుడు డెంగీ, తర్వాత స్వైన్ ఫ్లూ ఇలా ఎన్నో భయంకరమైన జబ్బుల గురించి మనం విన్నాము.కానీ ప్రస్తుతం అంతకంటే పెద్ద జబ్బు కేరళను వణికిస్తుంది.

కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది.కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి రోజురోజుకు విస్తరిస్తోంది.

ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి తొమ్మిది మంది చనిపోయారు.మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో 25 మందిని ప్రత్యేక వార్డులో చికిత్స చేయిస్తున్నారు.నిఫా వైరస్ పై హెల్త్ అధికారులు హై అలర్ట్ జారీ చేశారు.

Advertisement

జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.కేరళ రాష్ట్ర ఆరోగ్య విభాగం అధికారులు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

బాధితుల రక్త నమూనాలను పరీక్షల కోసం పుణేకి పంపించారు.

నిఫా వైరస్ పై కేంద్రం స్పందించింది.జాతీయ వ్యాధి నియంత్రణ బృందం కేరళ వెళ్లాల్సిందిగా కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆదేశించారు.కేరళలో నిఫా వైరస్ వ్యాప్తి కాకుండా అత్యంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జాతీయ వ్యాధి నివారణ బృందం తీసుకోవాల్సిన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కేంద్రం ఆదేశించింది.పందులు, ఇతర జంతువుల ద్వారా ఈ వైరస్ వస్తుందని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

అయితే ఈ వైరస్ కు ఇప్పటి వరకు మందు లేదు.నిఫా వైరస్ లక్షణాలు ఇవే.! 1.ఈ వ్యాధి సోకిన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.

Advertisement

విపరీతమైన, భరించలేని తలనొప్పితో బాధపడుతుంటారు.తలపోటుకి ట్యాబ్లెట్ వేసుకున్నా తగ్గదు.2.తీవ్ర జ్వరం కూడా వస్తుంది.

మెదడు కూడా మండిపోతున్నట్లు అనిపిస్తుంది.ఎండలో తిరిగేతే ఎలా అయితే మాడ మండిపోతుంది అంటామో.

అలాంటి ఫీలింగ్ వస్తుంది.ఎంతకీ తగ్గదు.

3.ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతారు.మన లోకంలో ఉండరు.

ఏం చెబుతున్నామో కూడా తెలుసుకోలేని స్థితికి వచ్చేస్తారు.రోజుల తరబడి నిద్రమత్తులోనే ఉంటారు.4.నిఫా వైరల్ లక్షణాలు ఉన్నవారు ఆహారం తీసుకోవటానికి కూడా ఇష్టపడదు.

మందులు వేస్తున్నా వాటి ప్రభావం తక్కువగానే ఉంటుంది.ఈ వైరస్ కు నేరుగా మందులేదు.జ్వరం, తలనొప్పి మందులతో తగ్గించటానికి

5.నిఫా వైరస్ లక్షణాలను ప్రాథమికంగానే గుర్తించినట్లయితే త్వరగా కోలుకోవటం వీలుంటుంది.అదే ఆలస్యం చేస్తే మాత్రం ప్రాణాలపైకి తెచ్చుకోవటం.

ఇప్పటికే కేరళ రాష్ట్రం కోజికోడ్ లో 9 మంది చనిపోయారు.నిఫా వైరస్.

రెండు రకాలుగా వ్యాప్తి చెందుతుంది.ఒక మనుషుల ద్వారా.

ఓ వ్యక్తికి నిఫా వైరస్ ఉంటే.తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా ఇతరులకు వస్తోంది.

అదే విధంగా గబ్బిలాలు, పందుల నుంచి కూడా వస్తుంది.ముఖ్యంగా గబ్బిలాలు తిన్న పండ్లన మనం తినటం, వాటిని తాకటం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది.

తాజా వార్తలు