బాబు చేతిలో ఇంటిలిజెన్స్ రిపోర్ట్...ఇప్పుడు ఏమి చేయబోతున్నారు..????

చంద్రబాబు వ్యూహాలు ఊహాతీతం.ఎప్పుడు ఎలాంటి మ్యాజిక్ లు జిమ్మిక్కులు చేస్తారో ఎవరికీ అంతుపట్టదు.

తనకున్న టెక్నాలజీ ని ఉపయోగించో లేదంటే అంతకంటే అడ్వాన్స్ గా పని చేసే తన మేధస్సుని ఉపయోగించే తిమ్మిని బమ్మి చేయడంలో ఆయనకీ ఆయనే సాటి.పార్టీలో ఒక విషయంపై నిర్ణయం తీసుకోవాలని అనుకునేటప్పుడు తన మంత్రి వర్గ సహచరులతో మంతనాలు జరిపి ఆ తరువాత ఒక నిర్ణయానికి వస్తారు.అయితే

ఫైనల్ గా తాను ఏదనుకుంటే దాన్నే ఫాలో అవుతారు.అంతేకాదు తాను తీసుకున్న ఫైనల్ డెసిషన్ తో పాటుగా ఇంటిలిజెన్స్ నుంచీ కూడా తరచూ సర్వేలు తెప్పించుకోవడం బాబు కి అలవాటు.ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా పార్టీలో ఉన్న సిట్టింగ్ లకి టిక్కెట్టు ఇవ్వాలా లేదా సాగానంపాలా అనే కోణంలో ఇంటిలిజెన్స్ ద్వారా తాజా రిపోర్ట్ తెప్పించారట బాబు.

మరి ఈ రిపోర్ట్ లో సిట్టింగులు ఎంత మంది ఉండబోతున్నారు, ఎంతమందికి బాబు షాక్ ఇవ్వబోతున్నారు అనే వివరాలలోకి వెళ్తే.రాబోయే ఎన్నికల్లో సిట్టింగులకు సీట్లు ఇవ్వాలా లేదా , ఇస్తే ఎవరికీ ఇవ్వాలి, ఆయా స్థానాలని మళ్ళీ గెలిపించుకునే సత్తా ఎవరికి ఉంది.?? అనే విషయాలపై చంద్రబాబు దగ్గర పూర్తి రిపోర్ట్ సిద్దంగా ఉందట.ఈ రిపోర్ట్ ఆధాంగానే బాబు నేతలకి సీట్లు కేటాయించే పనిలో పడ్డారని వినికిడి.

Advertisement

అయితే ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం చూస్తే.చాలా నియోజకవర్గాలలో టీడీపీ అభ్యర్ధుల పరిస్థితి దారుణంగా ఉందట.

గెలుపు అంచున ఉన్న వాళ్ళ సంఖ్య దాదాపు దారుణంగా పడిపోయిందనే రిపోర్ట్ చూసిన బాబు ఆందోళన చెండుతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు అందరితో వ్యక్తిగతంగా సమావేశం అవుతున్న బాబు ఎవరికైతే ఇంటలిజెన్స్ రిపోర్ట్ సరిగా లేదో వారికి టిక్కెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారట.మరోవైపు కాస్త పరవాలేదు అనుకున్న వారికి వార్నింగ్ లు ఇచ్చారని.ఇక గెలుపు అంచులలో ఉన్నవారికి గీతోపదేశం చేశారని తెలుస్తోంది.

అంతేకాదు ఈ నాలుగు నెలలు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభివృద్ధి కి కష్టపడాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.చంద్రబాబు నాయుడు దాదాపు తొలి విడతగా 15 మంది ఎమ్మెల్యేలతో చంద్రాబాబు మాట్లాడారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఈ 15 మందికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లేవని తేల్చి చెప్పినట్టుగా సమాచారం అందుతోంది.ఆయా నియోజకవర్గాల ప్రజలు సదరు ఎమ్మెల్యే ల గురించి ఏమని అనుకుంటున్నారు.

Advertisement

వారి పని తీరు ఎలా ఉంది.నియోజకవర్గంలో నేతల సంభంధాలు ఎలా ఉంటున్నాయి అనే విషయాలని చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటున్నారట.

ఏది ఏమైనా సరే పార్టీ గెలుపు కోసం చంద్రబాబు ఒక్కరే తపన పడితే సరిపోదని పార్టీలో అందరూ కలిసి పని చేయాలని కాని స్థానిక నేతలతో కలిసికట్టుగా లేకపోవడం వలెనే పార్టీ పరిస్థితి దారుణంగా ఉందనేది రాజకీయ పండితుల విశ్లేషణ.

తాజా వార్తలు