పండ్లు భోజనానికి ముందు తినాలా లేక భోజనం తరువాత?

పండ్లు తినాలని తెలుసు, తింటే ఆరోగ్యానికి మంచిదని తెలుసు.కాని ఎప్పుడు తినాలి? భోజనానికి ముందు తినాలా లేక భోజనం చేసిన తరువాత తినాలా అనేది చాలామందికి అర్థం కాని ప్రశ్న.

కొంతమంది భోజనానికి ముందే తినాలి అని అంటారు, మరికొందరేమో భోజనం తరువాతే తినాలంటారు.

ఇంతకి ఎప్పుడూ తినొచ్చు? అసలు ఫలం తినటానికి ఇది సరైన సమయం అనే సమయమే లేదు.అలాగే ఈ టైమ్ లో పండ్లు తినకూడదు అని వాదించటం కూడా దండగే.

నిజానికి పండ్లను భోజనానికి ముందు తినొచ్చు, భోజనం తరువాత తినొచ్చు, భోజనంతోపాటే తినొచ్చు.మరి భోజనం వేరుగా ఉంటుంది, పండ్లు వేరుగా ఉంటాయి, రెండూ ఓకేసారి తింటే జీర్ణక్రియపై అది ప్రభావం చూపదా అని మీకో డౌటు రావొచ్చు.

మన కడుపులో రకరకాల ఆహారానికి రకరకాల డైజెస్డీవ్ ఎంజైమ్‌లు ఉంటాయి.అందుకే, రెండు భిన్న రకాల ఆహారాన్ని ఒకేసారి తీసుకోవడం వలన ఎలాంటి ఇబ్బంది రాదు.

Advertisement

దీని వెనుక చాలా సింపుల్ లాజిక్.భోజనం చేసేటప్పుడు మనం అన్నంలో ఒకేరకమైన కూరని వాడట్లేదుగా, కాస్తంత కూరతో, కాస్తంత పచ్చడితో, కాస్తంత పెరుగుతో తింటుంటాం.

సో, మన ఆహారంలో ఎప్పుడూ ఒకే రకమైన న్యూట్రింట్స్ ఉండవు.భిన్నమైన ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి మన కడుపుకి ఉంటుంది.

అందుకే, పండ్లను ఎప్పుడైనా తినొచ్చు, భోజనానికి ముందైనా, తరువాతైనా!.

భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అన్యోన్య‌త పెరగాలా.? అయితే ఈ 5 వాస్తు టిప్స్ పాటించండి..!
Advertisement

తాజా వార్తలు