మహానుభావుడు సూపర్ హిట్ .. కాని శర్వానంద్ కి నష్టాలే?

ఒకప్పుడు సినిమా చేసామా, రెమున్యరేషన్ తీసుకున్నామా అన్నట్లు ఉండేది.కాని ఇప్పుడు కేవలం పారితోషికాన్ని లిక్విడ్ క్యాష్ రూపంలోనే పొందాలని చూడట్లేదు మన హీరోలు.

ఈ ట్రెండ్ సృష్టికర్త ఆమీర్ ఖాన్.మన బాలివుడ్ పర్ఫెక్షనిస్ట్ సినిమాకి ముందు పారితోషికం తీసుకోడు.

సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక లాభాల్లో వాటా తీసుకుంటాడు.ఆమీర్ సినిమాలు ఎలాగో వందల కోట్ల లాభాలు సంపాదిస్తుంటాయి.

ఇక దంగల్ కి ఆమీర్ 100 కోట్లకు పైగానే తీసుకున్నాడట.మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాకి ఇదే ప్రయత్నం చేస్తే అది కాస్త బెడిసికొట్టింది.

Advertisement

ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది.నాగచైతన్య కొన్ని సినిమాలకు పారితోషికానికి బదులు సాటిలైట్ హక్కులు చేతిలో పెట్టుకోని అమ్మేసుకున్నాడు.

ఇక శర్వానంద్ కూడా పారితోషికానికి బదులుగా తన సినిమాల ఓవర్సీస్ హక్కులు తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు‌.శతమానంభవతి లాభాల్ని మోసుకొస్తే, మహానుభావుడు మాత్రం బెడిసికొట్టేలా ఉంది.

మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పెద్ద సూపర్ హిట్.అందులో ఎలాంటి సందేహం లేదు.

కాని ఓవర్సీస్ లో కాదు‌.ఇండియా వరకు రఫ్ ఆడిస్తున్న మహానుభావుడు ఓవర్సీస్ లో డీలా పడిపోయింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇప్పటివరకు కేవలం $632k, అంటే నాలుగు కోట్లకు పైగా గ్రాస్ ని మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం.మహా అయితే 2-2.5 కోట్ల షేర్ మధ్య ఓవర్సీస్ పరుగు ముగించేలా ఉంది ఈ సినిమా‌.మరి రైట్స్ వాల్యూ మాత్రం 4 కోట్లు‌.

Advertisement

కోటికోటిన్నర నష్టమే కదా.

తాజా వార్తలు