బరువు తగ్గటానికి మష్రూమ్స్ కి సంబంధం ఏమిటో తెలుసా?

మీరు బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నారా ? బరువును ఎలా నియంత్రణ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఈ సమస్యకు చక్కని పరిస్కారం మష్రూమ్స్ అని చెప్పవచ్చు.

మష్రూమ్స్ ని పుట్టగొడుగులు అని కూడా పిలుస్తారు.

ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పుట్టగొడుగులను తీసుకుంటే త్వరగా కడుపు నిండిన భావన కలిగి ఆకలి కూడా తొందరగా వేయదు.దాంతో ఎక్కువ కేలరీలు కూడా తీసుకొనే అవకాశం ఉండదు.

మాంసంతో సమానమైన పోషకాలు పుట్టగొడుగుల్లోనూ ఉండటం వలన మాంసం తినని శాఖాహారులు పుట్టగొడుగులు మంచి ఆహారం.మాసంలోనూ, పుట్టగొడుగుల్లోనూ పోషకాలు మరియు కేలరీలు సమాన స్థాయిలో ఉంటాయి.

ఉదయాన్నే వైట్ బటన్ మష్రూమ్స్‌ను తింటే తొందరగా కడుపు నిండిన భావన కలిగి మధ్యాహ్న భోజనం వరకు ఆకలి వేయదు.ఒక పరిశోధనలో పది రోజులపాటు కొందరికి మాంసాహారం, మరికొందరికి మష్రూమ్స్ ఆహారంగా ఇచ్చారు.

Advertisement

వీరిలో పుట్టగొడుగులు తిన్న వారికి ఆకలి చాలా తక్కువగా వేసింది.త్వరగా కడుపు నిండిన భావన కూడా కలిగింది.

మాంసం తిన్నవారి కంటే మష్రూమ్స్ తిన్నవారే సంతృప్తిగా ఫీలయ్యారని ఈ పరిశోధనలో తేలింది.కడుపు నిండిన భావన కలగడం వల్ల అధిక మోతాదులో ఆహారం తీసుకొనే అవకాశం ఉండదు.

దాని ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.కాబట్టి పుట్టగొడుగులు ఆహారంగా తీసుకోని బరువు తగ్గటానికి ప్రయత్నం చేయండి.

ఫోకస్ పెంచిన కేటీఆర్.. నేడు రోడ్డు షో
Advertisement

తాజా వార్తలు