పవన్ పేరు చాలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును వాడుకున్నా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం టాలీవుడ్ సినీ జనాల్లో వుంది.

ఇప్పటికే పలువు పవన్ కళ్యాణ్ డైలాగ్స్ మరియు పాటలోనీ పదాలను సినిమా టైటిల్స్‌గా, సినిమాలో డైలాగ్స్‌గా వాడుకున్నారు.

ఇక ఏదైనా సినిమా ప్రమోషన్‌ను పవన్ వస్తే ఆ సెనిమాకు ఫుల్‌గా పబ్లిసిటీ వస్తుంది.ఇదే వుద్దేశ్యంతో "రేయ్" సినిమా నిర్మాత వైవీయస్ చౌదరి పవన్ నామ జపం చేస్తున్నాడు.

ఈయన స్వీయ దర్శకత్వలో నిర్మించిన "రేయ్" సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.ఈ సినిమాకు పవన్‌తో పబ్లిసిట్టి చేయించేందుకు చౌదరి ప్లాన్ చేస్తున్నాడు.

"రేయ్" సినిమా దాదాపు మూడు సంవత్సరాలుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న విషయం తెల్సిందే.ఈ సినిమా ఎట్టకేలకు మార్చి చివరి వారంలో విడుదలకు సిద్దం అవుతోంది.

Advertisement

ఇప్పటి వరకు నెగటివ్ పబ్లిసిటీ వున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేందుకు పవనిజం పాటను పెట్టబోతున్నాడు.ఆ పాటను పవన్ చేతుల మీదుగా విడుదల చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పవన్ పేరుతో ఈ సినిమాకు ఫుల్‌గా పబ్లిసిటీ వచ్చే అవకాశాలున్నాయి.సాయి ధరం తేజ్, సయామీ ఖేర్ జంటగా నటించిన ఈ సినిమాలో శ్రద్దా దాస్ ముఖ్య పాత్రలో నటిస్తోంది.

చక్రి సంగీతాన్ని అందించాడు.

సెట్లో బాలకృష్ణ, నాగార్జున ఎవరితో ఎలా ఉంటారో చెప్పేసిన నాగ మహేష్?
Advertisement

తాజా వార్తలు