రెండోసారి టీటీడీ చైర్మన్ పదవి తనకి ఇవ్వటంపై వై వి సుబ్బారెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.శ్రీవారికి ఎన్నిరోజులు సేవలు చేసిన తనివి తీరదు అని తెలిపారు.
ఈ క్రమంలో వారం పది రోజుల్లోనే పూర్తి బోర్డు ఏర్పడుతుందని స్పష్టం చేశారు.ఈ క్రమంలో రెండు మూడు రోజుల్లో టిటిడి బోర్డు చైర్మన్ గా పూర్తి బాధ్యతలు చేపట్టనున్నట్లు వై వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

మంచి ముహూర్తం చూసుకుని ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు.తాను ఎంతో హృదయపూర్వకంగా శ్రీవారికి సేవ చేయటం వల్ల రెండోసారి ఆ శ్రీనివాసుడు అవకాశం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.ఏడాదిలోనే కాశ్మీర్ రాష్ట్రంలో శ్రీవారి ఆలయం నిర్మిస్తామని మహారాష్ట్ర లో కూడా పూర్తి చేస్తామని వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఏదిఏమైనా తనకు రెండోసారి శ్రీనివాసుడి సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు.
ప్రత్యేకమైన కృతజ్ఞతలు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి తెలియజేశారు.