ఇటుకలు కావాలని బాబు ని అడుగుతున్న వైసీపీ ఎంపీ

తెలుగుదేశం పార్టీ మీద ఆ పార్టీ అధినేత చంద్రబాబు మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు వైసీపీ ఎంపీ.

ప్రస్తుతం ఏపీలో రాజధాని నిర్మాణంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతున్న సమయంలో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ న్యూఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు రాజధాని విషయమై ప్రశ్నించారు సురేష్ టీడీపీ అధికారంలో ఉండగా రాజధాని నిర్మిస్తామని పిల్లల నుంచి చందాలు, పెద్దల నుంచి ఇటుకలు పోగుచేశారని, ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయి అంటూ చంద్రబాబును సురేష్ ప్రశ్నించారు.రాజధాని నిర్మాణం పేరుతో టిడిపి అనేక అక్రమాలకు పాల్పడిందని, రాజధానిలో చంద్రబాబు ఆయన చుట్టూ ఉండే నాయకులు భారీగా ఆస్తులు కూడబెట్టారని, తాత్కాలిక భవనాల నిర్మాణం పేరుతో ఎక్కువ కమీషన్లు తీసుకొని నాసిరకం నిర్మాణాలు చేపట్టారని విమర్శించారు.

రాజధాని నిర్మాణం పై లెక్కలు అడుగుతుంటే వాటికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.అసలు రాజధాని ప్రాంతంలో టిడిపి రెండు నిర్మించారని అందులో ఒకటి హైకోర్టు మరొకటి తాత్కాలిక సచివాలయం నిర్మాణాలను మాత్రమే పూర్తి చేయించి ప్రజాధనం వృధా చేశారని మండిపడ్డారు.

రాజధాని కోసం శంకుస్థాపన కోసం లక్ష ఇటుకలు వచ్చాయని, అలాగే విద్యార్థుల నుంచి సుమారు పది లక్షల రూపాయలు చందాలు వచ్చాయని వాటిని ఏం చేశారు ? ఎలా ఖర్చు పెట్టారనే లెక్కలు ఇప్పటికీ చెప్పలేదన్నారు.చంద్రబాబు నలభై ఏళ్ల అనుభవం ఇదేనా అంటూ ఆయన మండిపడ్డారు.

Advertisement
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు